Home » మ‌హిళ‌లు వాడే ఈ మాత్ర‌లు ఏవిధంగా ప‌ని చేస్తాయో తెలుసా..?

మ‌హిళ‌లు వాడే ఈ మాత్ర‌లు ఏవిధంగా ప‌ని చేస్తాయో తెలుసా..?

by Anji
Ad

మ‌హిళ‌లు చాలా వ‌ర‌కు గ‌ర్భం దాల్చకుండా ఉండేందుకు గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌ను వినియోగిస్తుంటారు. గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌ను జాగ్ర‌త్త‌గా ఉప‌యోగించిన‌ట్ట‌యితే 99.7 శాతం గ‌ర్భదార‌ణ‌ను నిరోదించ‌డంలో ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తాయ‌ని నిర్థార‌ణ అయింది. అయితే ఈ మాత్ర‌ల కార‌ణంగా మ‌హిళ‌ల్లో గ‌ర్భం ఎలా ఆగిపోతుంద‌ని ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ మాత్రలు ఏవిధంగా ప‌ని చేస్తాయో తెలుసా..?

Basics about Home Pregnancy Tests | First Response

Advertisement

Advertisement

హెల్త్‌లైన్ నివేదిక ప్ర‌కారం.. గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌లో కృతిమ స్టెరాయిడ్ హార్మోన్లు ఉంటాయి. స్త్రీ శ‌రీరంలోకి చేరిన ఈ మాత్ర‌లు పిట్యూట‌రి గ్రంథి నుండి విడుద‌ల‌య్యే పొలిటిక‌ల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటినైజింగ్ హార్మోన్ ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయి. ఈ చ‌ర్య గ‌ర్భ‌దార‌ణ‌ను నివారించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఈమాత్ర‌ల వల్ల అండోత్స‌ర్గ‌మ‌నే ప్ర‌క్రియ ఆగిపోతుంది. అప్పుడు పిండం ఏర్ప‌డే ప‌రిస్థితులుండ‌వు. దీంతో గ‌ర్భాధార‌ణ ఆగిపోతుంది. అయితే ఈ మాత్ర‌లు వాడుతున్న‌ప్పుడు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి.

Contraceptives Pills Reduces Type 2 Diabetes Risk In Women With PCOS | New  Study: ఆ సమస్యతో బాధపడుతున్న మహిళలకు గర్భనిరోధక మాత్రలతో మేలు

గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌లు తీసుకునే ముందు త‌ప్ప‌నిస‌రిగా వైద్యుల‌ను సంప్ర‌దించాలి. వైద్యుల స‌ల‌హా లేకుండా గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌లు తీసుకుంటే చాలా ర‌కాల దుష్ప్రభావాలు క‌నిపిస్తాయి. ముఖ్యంగా త‌ల‌నొప్పి, నిద్ర‌రాక‌పోవ‌డం, అల‌స‌ట‌, మాన‌సిక వ్యాకుల‌త‌, బ‌రువు పెరగ‌డం, నిరాశ‌కు గురికావ‌డం వంటివి జ‌రుగుతుంది.

 

Visitors Are Also Reading