మూత్ర విసర్జన చేయడం అంటే శరీరంలోని మలినాలను బయటకు పంపడం. ఈ క్రమంలో కొంతమంది అధికంగా, మరికొందరు తక్కువగా మూత్రవిసర్జనకు వెళ్తారు. మరి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు ఎన్ని సార్లు మూత్ర విసర్జన చేయాలి.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు మానవుడు మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి అది తప్పనిసరి. ఈ విధంగా మూడు లీటర్లు తాగితే జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి.
Advertisement
ALSO READ:హిజ్రాలు ఎవరిని పెళ్లి చేసుకుంటారో తెలుసా..? అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
ఈ మోతాదులో తక్కువగా నీరు తాగితే అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనీసం రోజుకి రెండు లీటర్లు అయినా తాగే ఆరోగ్యవంతమైన వ్యక్తులు నాలుగు నుంచి ఏడు సార్లు మూత్రవిసర్జన చేయాలట. ఒకవేళ చాలా తక్కువగా చేసినట్లయితే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందట. అలా అని ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేసిన ఎలాంటి సమస్య అయితే ఉండదు.
Advertisement
ఆల్కహాల్, టీ,కాఫీ లాంటివి తాగినప్పుడు మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఉన్న వారు, డయాబెటిస్ ఉన్నవారు సహజంగా ఏడుసార్లు కన్నా ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్తారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే రోజుకు రెండు లీటర్ల నీటిని తాగి ఒక రోజులో 11 సార్ల కన్నా ఎక్కువ మూత్ర విసర్జనకు వెళ్తే మనం అనారోగ్యం బారిన పడ్డామని ఆలోచించుకోవాలి. వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలనీ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: