సిల్క్ స్మిత అలనాటి ప్రేక్షకులకు చెమటలు పట్టించిన నటి. సిల్క్ స్మిత సినిమాలో చేస్తుంది అంటే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది. ఆమె కనబడితే చాలు థియేటర్ అంతా గందరగోళం అయ్యేది. అలాంటి సిల్క్ స్మిత ఎన్నో సినిమాల్లో నటించి ఇండస్ట్రీలోనే టాప్ నటిగా ఎదిగింది. చాలా సంపాదించింది. చివరి రోజుల్లో మాత్రం చాలా నరకాన్ని అనుభవించి చనిపోయింది.
Advertisement
also read:నన్ను అల్లరి చేస్తున్నారు…పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేష్..!
అలాంటి సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్ సినిమాలో ఉంది అంటే ఆ సినిమా తప్పనిసరిగా హిట్టే. కాబట్టి అప్పట్లో దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూసి మరి సినిమాల్లో తప్పనిసరిగా పెట్టుకునేవారు. అలాంటి ముద్దుగుమ్మ 300కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆమెకు చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే పిచ్చి. వారి ఊర్లో సినిమా షూటింగ్ జరుగుతుంటే రోజు అక్కడికి వెళ్లి ఏదైనా వేషం ఉంటే ఇవ్వండి అని దర్శక నిర్మాతలను అడిగేదట. ఈ విధంగా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది.
Advertisement
అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా పారితోషకం తీసుకునేది అంటే ఈమె రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు అప్పట్లో ఈమె కొరికిన యాపిల్ ని వేలం వేస్తే లక్ష రూపాయల ధర పలికింది అంటే ఈమె క్రష్ ఏ విధంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో రాకెట్ల దూసుకుపోయిన సిల్క్ స్మిత, ప్రేమించిన వ్యక్తి, దగ్గర బంధువులు మోసం చేయడంతో చివరి రోజుల్లో చాలా దారుణమైన దీనస్థితిలో ఆత్మహత్య చేసుకొని మరణించింది.
also read: