Home » సుడిగాలి సుధీర్ కి వచ్చిన కష్టమేంటి.. అంత ఎమోషనల్ అవుతున్నారు ఎందుకు..!!

సుడిగాలి సుధీర్ కి వచ్చిన కష్టమేంటి.. అంత ఎమోషనల్ అవుతున్నారు ఎందుకు..!!

by Sravanthi
Ad

బుల్లితెర ప్రజెంట్ సెన్సేషన్ అంటే మనకు టక్కున గుర్తచ్చే పేరు సుడిగాలి సుదీర్. జబర్దస్త్ లో కమెడియన్ గా కితకితలు పెట్టిన సుధీర్ యాంకర్ రష్మీ తో లవ్ ట్రాక్ నడిపి సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోయాడు. ఇంత ఎంటర్టైన్ చేసే సుదీర్ లైఫ్ లో చాలా కష్టాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. సుడిగాలి సుదీర్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. అతడిని ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. అంతగా తన పంచులతో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ఫాదర్ కి సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసి ఎమోషనల్ అయ్యాడు. వరుస అవకాశాలతో ఇప్పుడు రెండు చేతులా సంపాదిస్తూ ఆనందంగా ఉన్నాం. కానీ అప్పట్లో మా ఫ్యామిలీ ఎదుర్కొన్న కష్టాలు చాలానే ఉన్నాయని సుధీర్ చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇంటర్ చదువుతున్న టైంలో నాన్నకి యాక్సిడెంట్ జరగడంతో కాలులో ఐరన్ రాడ్ పెట్టారు. ఆయన ముందే షుగర్ పేషెంట్ కావడంతో ఎక్కువ రెస్ట్ అవసరమైంది. అందువల్ల నేను మధ్యలోనే చదువు వదిలేసి ఇంటి బాధ్యతలు చూసుకోడానికి హైదరాబాద్ వచ్చేశాను.8వేల జీతంతో రామోజీ ఫిలిం సిటీ లో ఒక ఉద్యోగం లో చేరాను.నెలనెలా 500 రూపాయలు మాత్రమే ఉంచుకుని మిగిలినదంతా ఇంటికి పంపించే వాడిని. అలా అన్ని కష్టాలను భరిస్తూ జాబ్ చేసుకుంటూ వచ్చానని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆ ఉద్యోగాన్ని మానేయాల్సి వచ్చి, మళ్లీ కష్టాలు ఎక్కువయ్యాయని చెప్పాడు.

Advertisement

నేను అప్పట్లో మూడు పూటల భోజనం చేసిన రోజులను వేళ్ళపై లెక్కపెట్టవచ్చని, తినడానికి తిండి లేక నీళ్లు తాగి కడుపు నింపుకున్న రోజులు ఎన్నో అంటూ తను పడ్డ బాధలను సుధీర్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు జబర్దస్త్ లో ఛాన్స్ వచ్చిందని, అప్పటి నుండి నా జీవితమే మారిపోయిందని చెప్పాడు. ప్రేక్షకుల ప్రేమాభిమానలే నన్ను ఇంతవాడిని చేసిందని,వారికి ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నాడు. ఒకప్పుడు కనీసం గుర్తించని వారు, ఇప్పుడు పిలిచి మరీ ఛాన్స్ లు ఇస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నాడు. టాలెంట్ ఉన్న వాళ్ళకి చాన్స్ ఇస్తే ఎలా ఫేమస్ అయిపోతారు అనే దానికి ఉదాహరణగా సుడిగాలి సుధీర్ ని చూసి చెప్పవచ్చు. ఇక రష్మీ సుధీర్ ల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పక్కన పెడితే మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా కూడా అంతే వినయంగా ఉండటం సుధీర్ కి ఉన్న గొప్పతనం.

ALSO READ :

 

స్కిన్ షో కు అందుకే దూరంగా ఉంటా..కీర్తీ సురేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

 

Acharya : ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చ‌ర‌ణ్ ఎమోష‌న‌ల్ స్పీచ్‌.. ఏమ‌న్నారంటే..?

 

Visitors Are Also Reading