Telugu News » Blog » నయన్-విగ్నేష్ లా లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది..దాని వెనుక ఉన్న ట్విస్ట్ ఏంటంటే..?

నయన్-విగ్నేష్ లా లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది..దాని వెనుక ఉన్న ట్విస్ట్ ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నయనతార, ఏకంగా లేడీ సూపర్ స్టార్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో తన సత్తా చాటింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చేసిన చంద్రముఖి తెలుగులో కూడా డబ్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా అరంగేట్రం చేసిన నయనతార.అప్పటి నుంచి చాలా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి నయనతార బుధవారం ఉదయం 8:30 నిమిషాలకు మహాబలిపురంలో తను ప్రేమించిన వ్యక్తిని అంగరంగ వైభవంగా వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. అలాంటి నయనతార ఎలా ప్రేమలో పడింది.. ఎప్పుడు పడింది అనే విషయాలు ఓ సారి తెలుసుకుందాం..? 2015 లో వచ్చిన నేను రౌడీనే అనే సినిమా షూటింగ్ సమయంలో నయన్ విగ్నేష్ తొలి చూపులు కలిశాయి. ఇక అప్పట్నుంచి ఈ జంట రిలేషన్షిప్ లోనే ఉన్నారు. నయనతార విషయానికి వస్తే అసలు పేరు డయానా మరియం కురియన్ కేరళ రాష్ట్రం లోని తిరు వల్లిలో 1984 నవంబర్ 18న జన్మించింది. తండ్రి ఎయిర్ఫోర్స్ ఉద్యోగి. నయనతారకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు.

Ads

Ads

తండ్రి ఎయిర్ఫోర్స్ ఉద్యోగి కావడంతో ఆయనకు బదిలీలు ఉండేవి. దీంతో ఆమె విద్యాభ్యాసం చాలా ప్రాంతాల్లో జరిగింది. గుజరాత్ లో కొన్నాళ్ళు చదివారు. తన తండ్రి ఢిల్లీకి బదిలీ కావడంతో అక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. తిరువాళ్ళ లో సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. ఇంగ్లీష్ లిటరేచర్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నతనం నుండి నయనతారకు మోడలింగ్ పై ఆసక్తి ఉండడంతో చదువుతూనే మోడలింగ్ చేశారు. 2003లో సత్యం అత్తికాడ్ తాను చేయబోయే సినిమాలో నటించాలని కోరడంతో నయనతార మొదటిసారి సినిమాల్లో నటించారు. అయితే తనకు సినిమాలపై ఆసక్తి లేదని ఒక సినిమాలో మాత్రమే నటిస్తారని ఆ సమయంలో చెప్పింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటుగా మలయాళం లో హైయెస్ట్ వసూలు చేయడంలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది మూవీ.

ఈ విధంగా ఆమె సినీ కెరీర్ స్టార్ట్ అయింది. నయనతార భర్త పేరు విజ్ఞేశ్ శివన్ 1985 సెప్టెంబర్ 18న జన్మించారు. డైరెక్టర్ యాక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక విజ్ఞేశ్ శివన్ నయనతార పెళ్లి విషయానికి వస్తే నాన్ రౌడీ తాన్ అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా చేశారు. ఆ టైం లోనే వీరిమధ్య ఏర్పడినటువంటి పరిచయం ప్రేమగా మారింది. వీరు అప్పటి నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాయి అనే వార్తలు కూడా చాలా వచ్చాయి. వీరిద్దరూ కలిసి దేశంలోని పలు ఆలయాలకు ఫారెన్ టూర్లకు వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా ఆ ఫోటోలను షేర్ చేసే వారు. మీరు ఏజ్ పరంగా చూస్తే విగ్నేష్ కంటే నయనతారా పది నెలలు పెద్దది. అయినా ఈ ప్రేమ జంట ఈ రోజు ఒక్కటై కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

Ad

also read;

“విక్రమ్” సినిమాలో నటించిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా…సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందంటే…!

హ‌ర్ష సాయికి అస‌లు అన్ని డ‌బ్బులు ఎక్క‌డివి..? ఇత‌ను ఏం చేస్తాడు..?