Home » గ్రాఫిక్స్ లేకుండా ‘విచిత్ర సోద‌రులు’ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్ అలా ఎలా చూపించారంటే..?

గ్రాఫిక్స్ లేకుండా ‘విచిత్ర సోద‌రులు’ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్ అలా ఎలా చూపించారంటే..?

by AJAY
Ad

ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు సినిమాల‌న్నీ కూడా ప్ర‌యోగాల‌తో కూడుకొని ఉన్నాయి. అప్పుడు ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ కి పూర్తి భిన్నంగా ఆయ‌న సినిమాలుంటాయి. ఆయ‌న ఆలోచించి, ఆలోచింప‌జేసే విధంగా సినిమాలు తీస్తుంటారు. అలా ఆయ‌న మ‌స్తిష్కంలో నుంచి ఎన్నో ప్ర‌యోగాత్మ‌క, వినోదాత్మ‌క చిత్రాలు విడుద‌లై ప్రేక్ష‌కుల ఆనందింప‌జేసే విధంగా ఉంటాయి. అలాంటి సినిమాల‌కు హీరోగా క‌మ‌ల్ హాస‌న్‌నే ఎక్కువ‌గా సింగీతం శ్రీ‌నివాస‌రావు ఎంచుకుంటారు.

Advertisement

అమ‌వాస్య చంద్రుడు పూర్త‌యిన త‌రువాత పూర్త‌యిన త‌రువాత సింగీతం శ్రీ‌నివాస‌రావు, క‌మ‌ల‌హాస‌న్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా చేద్దామ‌నుకున్న త‌రుణంలో క‌మ‌ల్ హాస‌న్ ఓ స్టోరీ లైన్ చెప్ప‌గా దానిపై సింగీతం శ్రీ‌నివాస‌రావు ఓ క‌థ రాసుకున్నారు. ఈ సినిమాకు నిర్మాణ బాధ్య‌త‌లు క‌మ‌ల‌హాస‌న్ తీసుకున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన విచిత్ర సోద‌రులు తెలుగులో విడుద‌లైన ఒక డ‌బ్బింగ్ సినిమా. దీనికి మాతృక పూర్వ స‌హోద‌ర‌గ‌ల్ అనే ఓ త‌మిళ చిత్రం. ఆ చిత్రం అప్పు రాజాగా హిందీలో విడుద‌లైంది. 1989లో విడుద‌లైన విచిత్ర సోద‌రులు సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సాధించింది.

Also Read : 900 కోట్ల క‌లెక్ష‌న్ల‌తో 5వ స్థానంలో ఆర్ఆర్ఆర్…ముందున్న 4 సినిమాలివే…!

Advertisement


ఈ సినిమా విమ‌ర్శ‌కుల పాలు కూడా అయింది. క‌మ‌ల‌హాస‌న్ త‌ల్లి శ్రీ‌విద్య న‌టించింది. జాన‌కి పాత్ర‌లో హీరోయిన్‌గా గౌత‌మి న‌టించింది. క‌మ‌ల్ హాస‌న్ అప్పు, రాజాగా త్రి పాత్రాభిన‌యం చేశారు. ఈ త్రిపాత్రాభిన‌యం చిత్రంలో ఓ మ‌రుగుజ్జు పాత్ర కూడా ఉంది. గ్రాఫిక్స్‌లు లేని స‌మ‌యంలో క‌మ‌ల్‌హాస‌న్ ఎలా ఆ పాత్ర‌లో ఒదిగిపోయారన్న‌ది ఇంకా ప్రేక్ష‌కుల్లో ఓ మిస్ట‌రీగా మిగిలిపోయింది.

మ‌రుగుజ్జు పాత్ర‌లో కాకుండా ఇత‌ర పాత్ర‌ల్లో క‌మ‌ల్ హాస‌న్ క‌నిపించిన‌ప్పుడు సాధార‌ణంగా క్లోజ‌ప్ లేదా లాంగ్ షాట్స్ తీసేవారు. మ‌రుగుజ్జు పాత్ర వ‌చ్చే స‌రికి ఆయ‌న కాళ్ల‌ను వెనుక‌కు మ‌డిచి 18 అంగులాల షూస్ ప్ర‌త్యేకంగా త‌యారు చేయించి ఆయ‌న‌కు తొడిగేవారు. ఈ సినిమాలో బుజ్జి పెళ్లి కొడుకు కు రాజ‌యోగ‌ము రా అనే పాట‌లో ప్ర‌త్యేకంగా ఒక సోఫాను త‌యారు చేయించి క‌మ‌ల్ హాస‌న్‌ను న‌డుము వ‌ర‌కు అందులో దించి అత‌ని ముందు కృతిమ కాళ్ల‌ను అమ‌ర్చి ఆ కృతిమ కాళ్ల‌కు రెండు వైర్లు అమ‌ర్చి కాళ్లు ఊగేలా జ‌పాన్‌కు చెందిన సెట్ బాయ్ స‌హ‌కారంతో అలా చేశామ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు సంగీతం శ్రీ‌నివాస‌రావు చెప్పుకొచ్చారు. మానిట‌ర్ లేని స‌మ‌యంలో లేక్స్ తీసుకోకుండా క‌మ‌ల్ న‌టించిన తీరు ఎంతో ప్ర‌శంస‌నీయ‌మైంద‌ని చెప్పుకోవ‌చ్చు.

Also  Read :  HYPER AADI : జ‌బ‌ర్ద‌స్త్ కు హైప‌ర్ ఆది గుడ్ బై…షో చూసేదే అంటూ ఫ్యాన్స్…!

Visitors Are Also Reading