చాలామంది నటులు అవ్వాలని కలలు కంటూ ఉంటారు. కానీ అందరికీ అదే సాధ్యం కాదు కొంతమంది ఇండస్ట్రీ లోకి వచ్చి ఫెయిల్ అవుతూ ఉంటారు. చాలామంది ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత అవకాశాలు రాక మధ్యలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. నటుడు చరణ్ రాజ్ అందరికీ సుపరిచితమే కర్ణాటకలోని బెల్గాం కి చెందిన చరణ్ రాజశేఖర్ స్కూల్లో చదువుకుంటున్నప్పటినుండి కూడా కల్చరల్ ఆక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొనేవారు. పాటలు డాన్సుల్లో కూడా యాక్టివ్ గా ఉండేవారు. సినిమాల్లో నటించాలన్న కోరిక ఆయనకు ఎక్కువ ఉండేది. ఒకసారి కాలేజీలో జరిగిన కల్చరల్ కాంపిటీషన్లో నాలుగు బహుమతుల్ని గెలుచుకున్నారు.
Advertisement
Also read:
ఒకసారి ఒక స్నేహితుడు నువ్వు అందంగా ఉన్నావ్ డాన్సులు కూడా బాగా చేస్తున్నావ్ సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అన్నారు. దానికి చరణ్ మనకి సినిమాలెందుకురా మా కుటుంబం పరిస్థితి తెలుసు కదా అని చెప్పారట. ఒరేయ్ నువ్వు హీరో అవుతావా మొహం ని అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా అని గురురాజ్ భట్ అనే ఒక వ్యక్తి ఎగతాళి చేశాడు గురురాజ్ అందంగా ఉండేవాడట. ఆ ఉద్దేశంతో చరణ్ ని అలా అన్నారట. తప్పుగా మాట్లాడుతూ మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు నేను హీరోని కాలేను అనుకున్నావా అని అన్నారు. అది నీ వల్ల కాదు అని గురురాజ్ అన్నారు అప్పుడు దానిని ప్రెస్టేజ్ గా తీసుకొని తప్పకుండా హీరో అవుతానని ఛాలెంజ్ చేశారు.
Advertisement
Also read:
ఇంట్లో కూడా చెప్పకుండా తండ్రి వ్యాపారం కోసం పెట్టుకున్న కొంత డబ్బు తీసుకుని బెంగళూరు ట్రైన్ ఎక్కేసారట. పగలంతా సినిమాల అవకాశాల కోసం వెతుకుతూ రాత్రి హోటల్స్ లో పాటలు పాడడం చేస్తూ ఉండేవారు. పరాజిత అనే కన్నడ సినిమాతో హీరోగా మారారు ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి వంద రోజులు ఆడింది. వరుసగా సూపర్ హిట్ లు రావడంతో టాప్ హీరో స్థాయికి చేరుకున్నారు. చరణ్ రాజ్ ని చూసి అతని స్నేహితుడు గురురాజ్ హార్ట్ ఫుల్ గా కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. ఆ రోజు మర్చిపోలేనని చరణ్ ఒక సందర్భంలో చెప్పారు అలా ఛాలెంజ్ చేసి ఈ స్థాయికి చేరుకున్నారు తెలుగుతో పాటుగా తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో 400 సినిమాల్లో నటించారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!