Telugu News » Blog » జయం సినిమా అల్లు అర్జున్ కు ఎందుకు మిస్ అయ్యింది..?

జయం సినిమా అల్లు అర్జున్ కు ఎందుకు మిస్ అయ్యింది..?

by Manohar Reddy Mano

ప్రస్తుతం మన తెలుగులో టాప్ హీరో ఎవరు తెలుసుకోవడానికి చాలా మంది అభిమానులు పోటీ పడుతున్నారు. ఎందుకంటే ప్రతి హీరో ఇప్పుడు తీసే సినిమాలు అన్ని హిట్ అవుతూనే ఉన్నాయి. అందుకే నెంబర్ 1 హీరో ఎవరు అనేది తెలియడం లేదు. కానీ ఈ పోటీలో ఉన్న హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒక్కడు. ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా పరిచయం అయిన సినిమా జయం. ఇందులో సదా హీరోయిన్ గా నటించగా.. గోపీచంద్ విలన్ గా చేసాడు. అయితే ఏ సినిమా నితిన్ చేయాల్సింది కాదట..! అల్లు అర్జున్ కోసం తేజ ఈ సినిమా కథ రాసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే… తేజ మొదటి 2 సినిమాలు చిత్రం, నువ్వు-నేనులో ఉదయ్ కిరణ్ హీరోగా నటించాడు. కానీ ఆ తర్వాత వీరిద్దరి గ్యాప్ వచ్చి ఉదయ్ కిరణ్… వీఎన్‌.ఆదిత్యతో మనసంతా నువ్వే సినిమా చేశాడు. ఇది సూపర్ హిట్ అయ్యింది.

దాంతో ఉదయ్ కిరణ్ మీద కోపంతో అల్లు అర్జున్ తో జయం సినిమా తీయాలని తేజ అనుకున్నారు. కథ కూడా అరవింద్ కు చెప్పారు. కానీ అప్పటికే అల్లు అర్జున్ ను తాను పరిచయం చేస్తాను అంటూ కే రాఘవేంద్రరావు చెప్పడంతో.. అల్లు అరవింద్ అటు వైపు వెళ్లిపోయారు. అలా అల్లు అర్జున్ కు జయం సినిమా మిస్ అయ్యింది. కానీ ఆ తర్వాత నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి :

ఇషాన్ భయపడుతున్నాడు.. ఇలా అయితే కష్టం..!

సన్ రైజర్స్ కు మరో దెబ్బ..!

You may also like