Home » త‌న పేరుతో అభిమాని హోట‌ల్..చూసి చ‌చ్చానంటున్న వ‌ర్మ..!

త‌న పేరుతో అభిమాని హోట‌ల్..చూసి చ‌చ్చానంటున్న వ‌ర్మ..!

by AJAY
Ad

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. వ‌ర్మ ఒక‌ప్పుడు గొప్ప సినిమాలు చేసినా ప్ర‌స్తుతం మాత్రం ఒక్క హిట్ ను కూడా అందుకోలేక‌పోతున్నాడు. అంతే కాకుండా వివాదం ఎక్క‌డ ఉంటే ఆ అంశాన్ని ప‌ట్టుకునే సినిమా తీస్తున్నారు. ఇక అలా తీస్తున్న సినిమాలు విడుద‌లైనా ప్రేక్ష‌కులు కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇదిలా ఉంటే వ‌ర్మ తెర‌కెక్కించే సినిమాలు చూసినా చూడ‌క‌పోయినా ఆయ‌న‌కంటూ కొంతమంది ప్ర‌త్యేక అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆర్జీవీ మాట‌ల‌ను ఆయ‌న ఫిలాస‌ఫిని ఇష్ట‌ప‌డేవారు ఎంతోమంది ఉన్నారు.

Advertisement

అయితే తాజాగా వ‌ర్మ అభిమాని ఒక‌రు రామ్ గోపాల్ వ‌ర్మ పేరుతో ఏకంగా హోట‌ల్ పెట్టేశాడు. ఇక అతడితోపాటూ అతడి కుంటుంబంలోని వారంతా కూడా వ‌ర్మ అభిమానులే కావ‌డం విశేషం. ఆ హోట‌ల్ లో కూడా వ‌ర్మ చెప్పిన మాట‌లు మరియు సూక్తుల పోస్ట‌ర్లే అంటించారు. భోజ‌నం చేయ‌డానికి వ‌చ్చిన వాళ్లు కూడా వ‌ర్మ సూక్తులు చ‌దువుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ హోట‌ల్ తూర్పుగోదావ‌రి జిల్లా బెండ‌మ‌ర్ల గ్రామంలో ఉంది. ఇక హోట‌ల్ పెట్టిన ఆర్జవీ అభిమాని పేరు వెంక‌ట ర‌మ‌ణ‌….త‌న అభిమానాన్ని వ్యాపారంగా మ‌లుచుకుని వెంక‌ట ర‌మ‌ణ స‌క్సెస్ అయ్యాడు. ఆర్జీవీ పేరుతో హోట‌ల్ పెట్ట‌డంతో ఎంతోమంది ఈ హోట‌ల్ కు వ‌స్తున్నారు.

Advertisement

హోట‌ల్ లో బిర్యాణి, టిఫిన్స్ మ‌రియు ఫాస్ట్ ఫుడ్ కూడా ల‌భిస్తుంది. ఈ హోట‌ల్ కు వ‌చ్చిన అభిమానులు భోజ‌నం చేస్తూ తాము చూసిన ఆర్జీవీ సూక్తుల‌తో ఎంతో ధైర్యం వస్తుంద‌ని చెబుతున్నారు. ఇక ఆర్జీవీ మాట‌లు అంద‌రికీ అర్థం కాక‌పోవ‌చ్చ‌ని కానీ అర్థం అయితే అందులో ఎంతో అర్థం ఉంటుంద‌ని చెబుతున్నాడు. త‌న‌కు ఆర్జీవీ అంటే ఎంతో అభిమాన‌మ‌ని హోటల్ పెట్టి రెండేళ్లు అవుతుంద‌ని చెబుతున్నాడు. ఇక ఈ హోటల్ వీడియోను చూసిన వ‌ర్మ ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. త‌న పేరుతో హోటల్ పెట్టార‌ని…అది చూస్తే చ‌చ్చిపోవాల‌ని అనిపించింద‌ని పేర్కొన్నాడు.

Visitors Are Also Reading