Home » బాలయ్య సినిమాలో మళయాళ బ్యూటీ…!

బాలయ్య సినిమాలో మళయాళ బ్యూటీ…!

by Azhar
Ad
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు సినిమాల విషయంలో తగ్గేదే లే అంటూ దూసుకపోతున్న సంగతి తెలిసిందే. ఏ మధ్యే అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలయ్య… ఇప్పుడు వరుస సినిమాలు అనేవి చేస్తూ యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ప్రస్తుతం అఖండ జోష్ లో ఉన్న బాలయ్య.. ఇప్పుడు గోపీచంద్ మలినేనితో తన సినిమా అనేది చేస్తున్నాడు. గోపీచంద్ కూడా ఇప్పుడు క్రాక్ జోష్ లో ఉన్నాడు. దాంతో వీరి సినిమాపైన అప్పుడే భారీ అంచనాలు అనేవి పెరిగిపోయాయి.
అయితే ఈ సినిమా తర్వాత కూడా తాను చేయబోయే సినిమాను ఇప్పటికే ప్రకటించాడు బాలయ్య. టాలీవుడ్ లో వరుస హిస్ అందుకొని.. కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచినా దర్శకుడు అనిల్ రావిపూడితో తన 108వ సినిమా అనేది చేయబోతున్నారు బాలయ్య. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గురించి పెద్ద చర్చ అనేది జరుగుతుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారు అనేది ఇప్పటికే అందరికి క్లారిటీ వచ్చింది. ఇక అందులో మొదటి హీరోయిన్ గా తమన్నాను ఎంపిక చేసింది చిత్రయూనిట్. అయితే ఇప్పటికే అనిల్, తమన్నా కాంబినేషన్ లో మంచి హిట్స్ అనేవి ఉన్నాయి. అందుకే ఈ భామను ఎంపిక చేసారు.
కానీ ఇప్పటివరకు కూడా సెకండ్ హీరోయిన్ అనేది ఎవరు అనేది తెలియదు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ మళయాళ హీరోయిన్ నటించబోతుంది అని తెలుస్తుంది. మళయాళంలో ఇప్పుడు ఓ స్టార్  హీరోయిన్ గా కొనసాగుతున్న హనీ రోజ్ ఇప్పుడు బాలయ్యతో జత కట్టబోతుంది అని తెలుస్తుంది. అయితే ఇప్పటికే మళయాళంతో పాటుగా.. తమిళ్ సినిమాల్లో కూడా నటించిన హనీ రోజ్.. ఇప్పుడు బాలయ్య సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం అనేది చేయబోతుంది. మరి ఈ సినిమా అనేది హిట్ అవుతే హనీ రోజ్ కు తెలుగులో కూడా తిరుగుండదు అని తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading