Home » Holidays:మరో 10 రోజులు హాలిడేస్.. నిర్ణయం తీసుకున్న అధికారులు..!!

Holidays:మరో 10 రోజులు హాలిడేస్.. నిర్ణయం తీసుకున్న అధికారులు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలంగాణ యూనివర్సిటీలో గత కొంతకాలంగా గందరగోళం నెలకొంది. విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. దీనికి కారణాలేంటి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. యూనివర్సిటీ అంటే ఎంతో మంది మేధావులు తయారయ్యే విద్యాలయం. రాష్ట్రంలోని తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల తొమ్మిదవ సారి రిజిస్టర్ మార్పు అనేది జరిగింది.

Advertisement

కేవలం 22 నెలల కాలంలోనే 9సార్లు రిజిస్టర్లు మారడం ఇప్పటివరకు ఏ యూనివర్సిటీ చరిత్రలో కూడా లేదని చెప్పవచ్చు. అయితే తెలంగాణ యూనివర్సిటీకి వీసీగా ప్రొఫెసర్ రవీందర్ గుప్తా వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చాలామంది వీసీలు మారారు. యూనివర్సిటీలో వైస్ చాన్సలర్ హోదాలో ఉన్న వ్యక్తి తన ఇష్టానుసారంగా మార్పులు చేర్పులు చేయడంతో యూనివర్సిటీలో ఉండే పరిపాలన అస్తవ్యస్తమైంది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారింది.

Advertisement

వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలోనే విసి రవీందర్ గుప్తా జూన్ 1 నుండి హాస్టల్ లను మూసివేస్తున్నామని ప్రకటన చేయడం వివాదానికి దారి తీసింది. మళ్లీ 9వ తేదీన తెరుచుకుంటుంది అనడంతో విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయడం లేదు. మీరు ఏ విధంగా సెలవులు ఇస్తారు మీ ఇష్టానుసారంగా చేయడం ఏంటని ఖండిస్తున్నారు. ఖాళీ చేయకుండా హాస్టల్ లోనే ఉండిపోయారు.

మరికొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading