Home » ఒకే తరహా కథలతో, ఒకే రోజు విడుదలై.. హిట్ కొట్టిన స్టార్ హీరోల సినిమాలు.. ఇవేనా..?

ఒకే తరహా కథలతో, ఒకే రోజు విడుదలై.. హిట్ కొట్టిన స్టార్ హీరోల సినిమాలు.. ఇవేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకేరోజు ఒకే తరహా కథలతో 33 ఏళ్ల క్రితం ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ ఏర్పడింది. ఆ హీరోలే నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్.. ఇద్దరి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బాలయ్య ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు.

Advertisement

అలాగే డి.రామానాయుడు నట వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు విక్టరీ వెంకటేష్. ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలతో పోటీ పడ్డారు. కానీ ఒకే రోజు ఒకే తరహా కథతో విడుదలై బాక్సాఫీస్ వద్ద గందరగోళం సృష్టించిన సినిమాలు ఏంటో ఒక సారి చూద్దాం..?

Advertisement

ఈ సినిమా విడుదలై ముప్పై మూడు సంవత్సరాలు గడిచింది. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయి పోటీ పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విషయానికి వస్తే అవి ‘అశోక చక్రవర్తి, ధ్రువ నక్షత్రం’ మూవీస్. అశోక చక్రవర్తి సినిమా విషయానికి వస్తే బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఆయన్ సినిమాకు రీమేక్.. ఈ సినిమాను ఎస్ఎస్. రవి చంద్ర డైరెక్షన్ లో ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం 1989 జూన్ 29న రిలీజ్ అయింది.

 

అలాగే వెంకటేష్ హీరోగా ధ్రువ నక్షత్రం సినిమా దాదాపు మాఫియా బ్యాక్ గ్రౌండ్ లోని వై. నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని కూడా 1989 జూన్ 29 న రిలీజ్ చేశారు. ఇద్దరి మధ్య నెలకొన్న పోటీలు వెంకటేష్ నటించిన ధ్రువ నక్షత్రం సూపర్ హిట్ అయితే, బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి యావరేజ్ గా నిలిచింది.

ALSO READ;

పెళ్లి త‌రువాత సంతోషంగా ఉండ‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం చెప్పిన స‌మంత‌..!

ఆడవాళ్ళ చేతి వేళ్లు ఇలా ఉంటే.. భర్తకు అదృష్టం..!!

Visitors Are Also Reading