ఒకప్పుడు థియేటర్లోకి సినిమా వచ్చింది అంటే విద్యార్థులు కాలేజీలు ఎగొట్టి ఉద్యోగులు ఎలాగైనా సెలవు పెట్టి, సామాన్యులు పనులు మానేసి వారి అభిమాన హీరో సినిమా చూసేందుకు పరుగులు పెట్టేవారు. కానీ ప్రస్తుత కాలంలో జనాలు థియేటర్ల వైపు వెళ్లడం చాలా తక్కువ అయిపోయింది. వారిని థియేటర్ల వైపు పరుగులు పెట్టించాలంటే కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.
దీంతో డైరెక్టర్లు కూడా కొత్త ధనాన్ని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది తెలుగు డైరెక్టర్లు ప్రాంతీయ భాషపై సినిమాలు తీస్తూ కొత్తదనాన్ని చూపిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రేక్షకులు థియేటర్లలో క్యూ కడుతున్నారు. తెలంగాణ యాస, భాషా, డైలాగులు ఉండడంతో సినిమాలు హిట్ అవుతున్నాయి. అలా తెలంగాణ యాసలో వచ్చి హిట్ అయిన సినిమాల లిస్టు చూద్దాం..
వకీల్ సాబ్:
Advertisement
చాలా రోజుల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా కి తెలంగాణ భాష చాలా వర్కౌట్ అయింది. దీనికి జనాలు భ్రహ్మరథం పట్టారు.
జాతి రత్నాలు :
నవీన్ పోలిశెట్టి కీలక పాత్రలో ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ, హీరోకి సపోర్టింగ్ పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కూడా తెలంగాణ యాస మాట్లాడడంతో మంచి విజయం అందుకుంది..
బలగం:
Advertisement
ఈ మధ్యకాలంలో వచ్చిన అతి చిన్న సినిమా బలగం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి జనాలు బ్రహ్మ రథం పట్టారు.
లవ్ స్టోరీ :
అంతేకాకుండా నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన సినిమా లవ్ స్టోరీ కూడా తెలంగాణ యాసతో తీశారు. ఇది కూడా హిట్ అయింది.
డీజె టిల్లు :
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం డీజె టిల్లు కూడా తెలంగాణ యాసలో ఉండడంతో మంచి విజయాన్ని అందుకుంది.
ఆర్ఆర్ఆర్ :
అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా రాజమౌళి ఎన్టీఆర్ కు తెలంగాణ యాసలోనె చూపించారు.
వాల్తేరు వీరయ్య:
చిరంజీవి హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన మూవీ వాల్తేరు వీరయ్య. ఈ సినిమా కూడా తెలంగాణ యాసలో వచ్చి మంచి విజయం అందుకుంది.
మరికొన్ని ముఖ్య వార్తలు :
- మెగాస్టార్,బాలయ్య కలిసి నటించిన మూవీ ఉందని మీకు తెలుసా..?
- ఓ వివాహ వేడుకలో RRR..SR. NTR తో పాటు మరో ఇద్దరు సినీ దిగ్గజాలు..!
- జూన్ 01 నుంచి అమలయ్యే కొత్త రూల్స్ ఇవే..!