Hit 2 Movie Review in Telugu : ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న హీరోల్లో అడవి శేషు కూడా ఒకరు. అడవి శేషు వరుస హిట్లతో డిఫరెంట్ సినిమాలతో టాలెంటెడ్ హీరోగా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం అడవి శేషు హీరోగా హిట్ -2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. శైలేష్ కొలను హిట్ సినిమాను ఒక సిరీస్ గా మొత్తం ఏడు సినిమాలను ప్లాన్ చేశాడు. సీరియల్ కిల్లర్ తరహాలో హిట్ సిరీస్ ఉండబోతుందని ఇప్పటికే ప్రకటించారు.
సినిమా – హిట్ -2
Advertisement
నటీనటులు – అడవిశేషు, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్, శ్రీనాత్ మాగంటి, రావు రమేష్, పోసాని, తనికెళ్ల భరణి మరికొందరు.
డైరెక్టర్ శైలేష్ కొలను
సంగీతం -సురేష్ బొబ్బిలి. ఎంఎం. శ్రీలేఖ
నిర్మాత – నాని
ఇక ఒక్కో సిరీస్ లో ఒక్కో హీరోను తీసుకుంటున్నారు. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక హిట్ సిరీస్ 2 లో అడవిశేషు ను హీరోగా తీసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా నేడు విడుదలైంది. మరి ఈ సినిమా హిట్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం…
కథ కథనం :
Advertisement
హిట్ 2 సస్పెన్స్ క్రైమ్ ట్రిల్లర్ నేపథ్యంలో నేపథ్యం లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అడవి శేషు కేడి అనే పోలీస్ పాత్రులో నటించాడు. సినిమాలో కేడి క్రైమ్ మిస్టరీ లను… చిన్నచిన్న కేసులను సింపుల్ గా సాలో చేస్తూ ఉంటాడు. అయితే కేడీకి వద్దకు ఒక మిస్టరీ సీరియల్ క్రైమ్ కేసు వస్తుంది. ఆ కేసును సాలో చేయడానికి చాలా కష్టపడతాడు. ఈ క్రమంలో ఆ కేసుని కేడీ సాలో చేశాడా లేదా .. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు అన్నదే ఈ సినిమా కథ.
విశేషణ :
సినిమా స్క్రీన్ ప్లే లో ప్రతి చోటా అడవి శేషు కనిపిస్తాడు. ఈ సినిమా అడవి శేషు వన్ మ్యాన్ షో అనిపించేలా ఉంటుంది. అడవి శేషుకు హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి తన పాత్రతో ఆకట్టుకుంది. రావు రమేష్ ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దశకుడు శైలేష్ కొలను హిట్ సినిమాతో త్రిల్లర్ సినిమాలు తీయగలను అని నిరూపించుకున్నాడు. ఇక హిట్ 2 తో మరోసారి తన పేరును నిలబెట్టుకున్నాడు. సినిమాలో విలన్ ఎవరు అన్నదాన్ని దర్శకుడు క్లైమాక్స్ వరకు సస్పెన్స్ తో చూపించగలిగాడు. థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. రాసుకున్న కథను తెరపై చూపించడంలో శైలేష్ కొలను సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింత బాగుంటే కథకు సరిపోయేదేమో అనిపిస్తుంది.
Also Read: itlu maredumilli prajaneekam movie review : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ అండ్ రేటింగ్…!