Home » విజయ్ దేవరకొండ కు లైఫ్ ఇచ్చిన “పెళ్ళి చూపులు” సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా…?

విజయ్ దేవరకొండ కు లైఫ్ ఇచ్చిన “పెళ్ళి చూపులు” సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు ఎవరో తెలుసా…?

by AJAY
Ad

లైగర్ సినిమాతో పాన్ ఇండియాకు పరిచయం అవ్వబోతున్న విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు విజయ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది.

Advertisement

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరికెక్కిన ఈ చిత్రానికి యూత్ ఫిదా అయ్యారు. సినిమాలో హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవ్వడం…. ప్రియదర్శి కామెడీ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నేషనల్ అవార్డును సైతం అందుకుంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండను స్టార్ ను చేసిన ఈ సినిమాను టాలీవుడ్ లోని కొంతమంది స్టార్ హీరోలు మిస్ చేసుకున్నారు.

Advertisement

వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం…. తరుణ్ భాస్కర్ ఈ సినిమా కథను మొదట అక్కినేని హీరో అఖిల్ కు విడిపించారట. కానీ కథ పూర్తిగా విన్న అఖిల్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ ఇదే సినిమా కథను మెగాపిన్స్ వరుణ్ తేజ్ కు సైతం వినిపించారట.

వరుణ్ తేజ్ కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టు తరుణ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. ఆ తర్వాత తన స్నేహితుడైన విజయ్ దేవరకొండకు వినిపించగా అతడు ఓకే చెప్పాడని తెలిపాడు. అలా స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన కథ తో విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Also read : పెళ్లి చేసుకోమ‌ని అత‌ను ఆరేళ్లుగా వేధించాడు.. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన నిత్యామీన‌న్

Visitors Are Also Reading