Telugu News » స్మోకింగ్ వ్య‌స‌నం నుండి బ‌య‌ట‌ప‌డిన మ‌న హీరోలు..!

స్మోకింగ్ వ్య‌స‌నం నుండి బ‌య‌ట‌ప‌డిన మ‌న హీరోలు..!

by AJAY MADDIBOINA

పొగ‌తాగ‌డం ఆరోగ్యానికి హానిక‌రం క్యాన్స‌ర్ కు కార‌కం ఇది ప్ర‌తి సినిమాకు ముందు వేస్తారు. కానీ ఆ సినిమాలో న‌టించే హీరోలే చాలా మంది పొగ‌తాగ‌టం అల‌వాటు చేసుకున్నారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాద‌ని తెలుసుకుని విడిచిపెట్టారు. నిజానికి ఒక‌సారి స్మోకింగ్ అల‌వాటైతే మ‌ళ్లీ వ‌దిలిపెట్ట‌డం అంత ఈజీ కాదు. కానీ మ‌న హీరోలు స్మోకింగ్ కు దూరంగా ఉంటూ అభిమానుల‌కు ఆద‌ర్శంగా ఉంటున్నారు. ఆ హీరోలు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

మ‌హేశ్ బాబు
ప్రిన్స్ మహేశ్ బాబు సినిమాల్లో ఎంతో స్టైల్ గా ద‌మ్ముకొడుతూ క‌నిపిస్తాడు. ఇక నిజ‌జీవితంలోనూ అదే అల‌వాటు ఉండేద‌ట‌. కానీ ఓ ఫ్రెండ్ ఇచ్చిన పుస్త‌కం చ‌దివి స్మోకింగ్ కు గుడ్ బై చెప్పాడ‌ట‌.

rana

రానా
రానాకు ఒక‌ప్పుడు చైన్ స్మోక‌ర్ అని పేరుంది. అయితే ఓ షోలో తన‌కు ఉన్న చెడు అల‌వాట్ల వ‌ల్ల అనారోగ్యానికి గుర‌య్యాన‌ని ప్ర‌స్తుతం అన్ని అల‌వాట్ల‌ను మానుకోగ‌లిగాన‌ని రానా చెప్పాడు.


విజ‌య్ దేవ‌ర కొండ‌
విజ‌య్ దేవ‌ర కొండ‌కు కూడా ఒక‌ప్పుడు స్మోకింగ్ అల‌వాటు ఉండేద‌ట‌. కానీ ఆరోగ్యం పై ఉన్న శ్ర‌ద్ద‌తో విజ‌య్ స్మోకింగ్ ను దూరం పెట్టాడ‌ట‌.

kamal hasan

kamal hasan

క‌మ‌ల్ హాస‌న్
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాసన్ త‌న తోటి హీరోయిన్ల‌కు ఇబ్బంది క‌ల‌గ కూడ‌ద‌ని స్మోకింగ్ ను ప‌క్క‌న పెట్టాడ‌ట‌.

rajnismoke

rajnismoke

ర‌జినీకాంత్
ర‌జినీకాంత్ కు మందు నుండి స్మోకింగ్ అల‌వాటు ఉంది. అయితే త‌న‌కు మ‌న‌వ‌డు పుట్టిన త‌ర‌వాత అత‌డికోసం ర‌జినీ స్మోకింగ్ ను ప‌క్క‌న పెట్టాడు.

also read : ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 త‌ప్పులు అస్స‌లు చేయ‌కండి..!

You may also like