సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసుల్ని ఇండస్ట్రీకి పరిచయం చెయ్యాలంటే చాలా పెద్ద హంగామా ఉంటుంది. డైరెక్టర్స్‌తో డిస్కర్షన్స్ , ప్లాన్స్ లాంటివి చాలానే ఉంటాయి. ఇలా డిస్కషన్ అయిన తర్వాత అంతా ఓకే అయ్యాక కూడా ఒక్కోసారి ఆ డైరెక్టర్ ఆ కథ ఉండదు. తిరిగి వేరే డైరెక్టర్ వేరే కథలతో సినిమాలు తీసేస్తుంటారు. అవేంటో ఓ సారి చూద్దాం.
మహేష్ బాబు :
Advertisement
ప్రిన్స్ మహేష్‌బాబు విషయానికి వస్తే ముందుగా మహేష్‌బాబుని దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి యమలీల చిత్రంతో మహేష్‌ని లాంచ్ చేద్దామనుకున్నారు. కానీ కృష్ణ మహేష్ చదువుకోసం ఆ ప్రాజెక్ట్‌ని క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత మహేష్ లాంచ్ కోసం డైరెక్టర్ కృష్ణవంశీని కలిశారు. మొదటి సినిమా అంటే ఫ్యాన్స్‌లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దాన్ని రీచ్ కాలేనేమో అని నేను చెయ్యలేను అన్నారు కృష్ణవంశీ. అలారాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో రాజకుమారుడు మూవీ విడుదలయింది.
రామ్‌చరణ్ :
ఇక రామ్‌చరణ్ మొదటి చిత్రం చెయ్యడానికి ఎస్.ఎస్. రాజమౌళి ప్రయత్నించారు. ఇక కథ అంతా రెఢీ చేసుకుని చిరంజీవి చెప్పగా చిరంజీవి ఓకే అని కూడా అన్నారు. మళ్ళీ చిరంజీవి ఒక మాస్ హీరోగా ఇండస్ట్రీలో ఎలా నిలబెట్టాలో బాగా తెలుసు దాంతో పూరీజగన్నాధ్ని సంప్రదాంచారు చిరు. పూరీ అప్పటికే పోకిరీ, దేశముదురు వంటి హిట్స్ ఇచ్చి ఉన్నారు. దాంతో చరణ్‌ని ఇంట్రడ్యూస్ చెయ్యమని అడిగారు. దాంతో చరణ్ ఫస్ట్ మూవీ చిరుత విడుదలయింది.
అల్లుఅర్జున్:
స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌ని జయం మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యాలనుకున్నారు తేజ. అల్లుఅరవింద్ కూడా ఓకేఅన్నారు. కానీ ఆ తర్వాత ఏమి జరిగిందన్న కారణాలు తెలియవు కానీ ఆ చిత్రానికి నితిన్‌ని హీరోగా తీసుకున్నాడు తేజ. ఆ తర్వాత బన్నీ ఫస్ట్ మూవీగా గంగోత్రి వచ్చిన సంగతి తెలిసిందే.
నాగచైతన్య:
Advertisement
నాగచైతన్య విషయానికి వస్తే రవితేజ, అల్లుఅర్జున్ హీరోలందరినీ స్టార్స్‌ని సూపర్ స్టార్స్‌ని చేసిన దర్శకుడు పూరిజగన్నాధ్ దర్శకత్వంలో లాంచ్ చెయ్యాలని నాగార్జున అనుకున్నారు. పూరి ఓ కథ చెప్పగా నాగ్ అందులో చిన్న చిన్న మార్పులు చెప్పాడు. ఇక ఆ మార్పులను పూరి ఒప్పుకోలేదు. దాంతో వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అలా ఆ ప్రాజక్ట్ అటకెక్కి ఓ కొత్త దర్శకుడితో చైతన్య జోష్ చిత్రం తెరకెక్కింది.
అఖిల్:
అఖిల్ మనం చిత్రంతో చిన్న గెస్ట్ పాత్రలో ఇంట్రడ్యూస్ చేసిన విక్రమ్ కుమార్‌నే అఖిల్ ఫస్ట్ మూవీని డైరెక్ట్ చెయ్యమని నాగ్ అడిగారు. దానిమేరకు చర్చలు కూడా జరిగాయి. కన్ఫామ్ అన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక అల్లుడు శీను మూవీ చూశాక నాగ్ మనసుమార్చుకుని వినాయక్ లాంటి డైరెక్టర్ అఖిల్‌కి కరెక్ట్ అని వినాయక్‌తో మాట్లాడి అఖిల్ సినిమాని తెరకెక్కించారు.
రామ్:
రామ్ యువసేన్ చిత్రం అందరికీ గుర్తు ఉండేఉంటది. ఈ చత్రం ద్వారా పెదనాన రవికిశోర్ ఇండస్ట్రీకి పరిచయం చేద్దామని దీని రైట్స్ కొన్నారు. ఓ రోజు ఏదో పనిమీద దేవదాస్ మూవీ వై.వి.ఎస్ చౌదరి ఆఫీస్‌కి రామ్ వెళ్ళారు. అప్పటికే రామ్ నటించిన ఓ షార్ట్ ఫిల్మ్ వై.వి.ఎస్ చౌదరి చూడడం జరిగింది. కొత్త హీరో హీరోయిన్స్ కోసం చూస్తున్న చౌదరికి హీరోగా రామ్‌ని ఓకే చేసుకున్నాడు. దాంతో యువసేన బదులు దేవదాస్ రామ్ ఫస్ట్ మూవీ అయింది.
వరుణ్ తేజ్:
వరుణ్ తేజ్ ని కృష్ దర్శకత్వంలో లాంచ్ చేద్దామని నాగబాబు డిసైడ్ అయ్యారు. స్టోరీ కూడా రెఢీ అదే విషయం చిరంజీవితో చెప్పగా ఆ కథ తన మొదటి చిత్రానికి కరెక్ట్ కాదు అని చెప్పడంతో నాగబాబు వెనక్కి తగ్గగా శ్రీకాంత్ అడ్డాల లైన్లోకి వచ్చి ముకుందా చిత్రాన్ని తీశారు.
Also Read: విజయనిర్మల మొదటి భర్త గురించి మీకు తెలుసా?