Telugu News » సుమ‌న్ జైల్లో ఉన్న‌ప్పుడు అండ‌గా నిలిచిన ముగ్గురు హీరోయిన్లు..!

సుమ‌న్ జైల్లో ఉన్న‌ప్పుడు అండ‌గా నిలిచిన ముగ్గురు హీరోయిన్లు..!

by AJAY MADDIBOINA

టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో సుమ‌న్ ఒక‌రు. వంద‌కు పైగా సినిమాలు చేసిన సుమ‌న్ స్టార్ హీరో స్టేట‌స్ ను మాత్రం అందుకోలేక‌పోయారు. దానికి అనేక‌కార‌ణాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సుమ‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. తాను ఎంజీఆర్ అభిమాని అని తాయ విజ‌న్ ను ఫాలో అవుతాన‌ని చెప్పారు. హీరోలు నార్మ‌ల్ పీపుల్ అని వారిని డ‌బ్బులు పెట్టి స్టార్ లుగా మార్చేది నిర్మాత‌లే అని చెప్పారు. నిర్మాత‌లు ఇల్లు తాక‌ట్టు పెట్టి….ఎక్క‌డ నుండో అప్పులు తెచ్చి సినిమాలు చేస్తార‌ని ఏమైనా తేడా వ‌స్తే వాళ్లు రోడ్డు పైకి వ‌స్తార‌ని వాళ్లు దేవుడితో స‌మాన‌మ‌ని అన్నారు.

Ads

Suman

ఇదే విష‌యాన్ని తాను ఎంజీఆర్ నుండి నేర్చుకున్నానని అన్నారు. తానెలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చాన‌ని నిర్మాత‌ల వ‌ల్లే ఈ స్థాయికి వ‌చ్చాన‌ని చెప్పారు. అప్ప‌ట్లో తాను 10ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చేవార‌ని అన్నారు.అది ఇప్పుడు 10 కోట్ల‌తో స‌మాన‌మ‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా అప్ప‌ట్లో సుమ‌న్ నీలి చిత్రాలు తెర‌కెక్కిస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌ కేసులో జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. అంతే కాకుండా ఆయ‌న ఆరు నెల‌ల పాటూ జైలు జీవితం గ‌డిపారు.

అయితే ఆ స‌మ‌యంలో త‌న‌కు ముగ్గురు హీరోయిన్ లు స‌హాయం చేశారని….వాళ్లు ఓ మ్యాగ‌జైన్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ త‌న‌కు ప్ల‌స్ అయ్యింద‌ని చెప్పారు. అయితే ఆ హీరోయిన్లు ఎవ‌రో కాదు సుహాసిని, సుమ‌ల‌తతో పాటూ మ‌రో త‌మిళ హీరోయిన్ కూడా సుమ‌న్ సహాయం చేశారు. వాళ్లు త‌న‌తో సినిమాలు చేశార‌ని త‌న గురించి వాళ్ల‌కు తెలుస‌ని సుమ‌న్ అన్నారు.

అంతే కాకుండా త‌న స్నేహితుడు ఒక‌రు చేసిన న‌కిలీ ఆరోప‌ణ‌ల వ‌ల్లే తాను జైలుకు వెళ్లాన‌ని కూడా చెప్పారు. ఈ కేసు వ‌ల్ల ఆరు నెల‌లు ఇబ్బంది ప‌డ్డాన‌ని అన్నారు. త‌న‌కుఉ ఉన్న ఇమేజ్ కు అలాంటి ప‌నులు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఈ కేసు లేక‌పోతే సుమ‌న్ స్టార్ హీరో స్థాయిలో ఉండేవార‌ని ఇండ‌స్ట్రీలో చెప్ప‌కుంటారు.


You may also like