Home » సినీ ఇండస్ట్రీలో తండ్రి కొడుకులతో నటించిన హీరోయిన్స్ ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో తండ్రి కొడుకులతో నటించిన హీరోయిన్స్ ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

ఏ ఇండస్ట్రీలో చూసుకున్న ఓకే హీరోయిన్ ఓసారి తండ్రితో మరోసారి తన కొడుకుతో నటించడం చాలా తక్కువ చూస్తాం. అయితే తాజాగా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఇప్పటికే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తో ఎవడు సినిమాలో నటించింది. ప్రస్తుతం చిరంజీవితో వాల్తేరు వీరయ్య చిత్రంలో నటించింది. ఈ విధంగా హీరోలైన తండ్రి కొడుకులతో నటించిన కొంతమంది హీరోయిన్స్ లిస్టు ఇప్పుడు చూద్దాం..

#1. శృతిహాసన్ :

Advertisement


తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన తండ్రి కొడుకుల సరసన శృతిహాసన్ నటించింది. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ సరసన ఎవడు మూవీలో హీరోయిన్ గా శృతిహాసన్ చేసింది. ప్రస్తుతం వాల్తేరు వీరయ్యలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది..

#2. కాజల్ అగర్వాల్:

ఈ అమ్మడు కూడా రామ్ చరణ్ తో మగధీర,నాయక్, గోవిందుడు అందరివాడేలే సినిమాల్లో చేసింది. అలాగే చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 లో తెరను పంచుకుంది.

#3. తమన్నా :

తమన్నా కూడా రామ్ చరణ్ సరసన రచ్చ మూవీలో చేస్తే, చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి మూవీలో చేసింది.

#4. రకుల్ ప్రీత్ సింగ్ :

ఈ ముద్దుగుమ్మ కూడా నాగార్జున కుమారుడు నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం మూవీలో నటించింది. ఆ తర్వాత నాగార్జున మన్మధుడు 2 లో కూడా హీరోయిన్ గా చేసింది.

Advertisement

#5. లావణ్య త్రిపాటి:


నాగ చైతన్యతో యుద్ధం శరణంలో నటించింది. ఇక నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన అనే చిత్రంలో చేసింది.

also read:సూర్యవంశం సినిమాలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..? 

#6. జయసుధ:

ఈ హీరోయిన్ కూడా ఎన్టీఆర్ తో అనేక సినిమాలో నటించింది. ఇక బాలకృష్ణతో అధినాయకుడు మూవీలో నటించింది.

#7. రాధా :


ఈ హీరోయిన్ ఏఎన్ఆర్ తో ఆదర్శవంతుడు, గోపాలకృష్ణుడు వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత నాగార్జునతో విక్కీ దాదా అనే చిత్రంలో నటించింది.

#8. ఐశ్వర్యారాయ్ :


అమితాబ్ బచ్చన్ కోడలైన ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ తో పలు సినిమాలో నటించింది. కానీ బంటి ఔర్ బబ్లీ చిత్రంలో తండ్రి తనయులతో కలిసి కజురారే అనే పాటలో ఆడి పాడింది.

#9. భానుప్రియ :

సూపర్ స్టార్ కృష్ణతో గూడచారి 117 సినిమాలో హీరోయిన్ గా చేసింది. తన కుమారుడైన రమేష్ బాబుతో బ్లాక్ టైగర్ మూవీ లో కథానాయికగా మెప్పించింది.

also read:

Visitors Are Also Reading