Home » తండ్రి వ‌య‌సున్న హీరోల‌కు జోడీగా న‌టించిన 6గురు టాలీవుడ్ హీరోయిన్ లు వీళ్లే..!

తండ్రి వ‌య‌సున్న హీరోల‌కు జోడీగా న‌టించిన 6గురు టాలీవుడ్ హీరోయిన్ లు వీళ్లే..!

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో అవకాశాలు త‌గ్గాయంటే కుర్ర హీరోయిన్ త‌మ‌కంటే ఏజ్ లో చాలా గ్యాప్ ఉన్న హీరోల‌కు సైతం హీరోయిన్ లుగా నటిస్తుంటారు. వ‌చ్చిన ఆఫర్ ల‌ను వ‌దులుకోలేక‌నో రెమ్యున‌రేష‌న్ టెమ్టింగ్ గా ఉండ‌టం వ‌ల్ల‌నో తెలియ‌దు కానీ కొన్ని సార్లు హీరోయిన్ లు త‌మ తండ్రి వ‌య‌సున్న హీరోల‌కు కూడా జోడీ క‌డుతుంటారు. అలా టాలీవుడ్ లో తండ్రి వ‌య‌సు ఉన్న హీరోల‌తో జోడీ క‌ట్టిన హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం…

Advertisement

#1) శ్రీలీల
రీసెంట్ గా విడుద‌లైన ధ‌మాక సినిమాలో ర‌వితేజ కు జోడీగా హీరోయిన్ శ్రీలీల న‌టించింది. ర‌వితేజ వ‌య‌సు 54 ఏళ్లు అయితే శ్రీలీల వ‌య‌సు కేవ‌లం 21 ఏళ్లు మాత్రమే కానీ సినిమాలో మాస్ మ‌హారాజ్ కు జోడీగా న‌టించింది.

#2) శృతిహాసన్
క‌మ‌ల్ హాస‌న్ కూతురు శృతిహాసన్ త‌న తండ్రి వ‌య‌సున్న మెగాస్టార్ కు జోడీగా వాల్తేరు వీర‌య్య సినిమాలో జోడీగా న‌టించింది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.

Advertisement

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య హీరోగా న‌టించిన వీర‌సింహారెడ్డి సినిమాలో కూడా శృతి హీరోయిన్ గా న‌టించింది. ఏజ్ ప‌రంగా చూస్తే వీరిద్ద‌రిది కూడా తండ్రీ కూతుళ్ల వ‌య‌సే అని చెప్పాలి.

ఇవి కూడా చదవండి : మా అబ్బాయి, కోడ‌లు నాలుగేళ్లుగా మాట్లాడ‌టం లేదు..న‌టి శ్రీసుధ ఎమోష‌న‌ల్..!

#3)  రితికా సింగ్
విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా న‌టించిన గురు సినిమాలో హీరోయిన్ గా రితికా సింగ్ న‌టించింది. వీరిద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ కూడా ముప్పై ఏళ్ల పైనే ఉంటుంది.

#4) లావ‌ణ్య‌త్రిపాఠి

నాగార్జున హీరోగా న‌టించిన సోగ్గాడే చిన్ని నాయినా సినిమాలో లావ‌ణ్య‌త్రిపాఠి హీరోయిన్ గా న‌టించింది. లావ‌ణ్య త్రిపాఠి ఏజ్ కూడా ముప్పై ఏళ్లే.

#5) శ్రీదేవి

అన్న‌గారు ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేష‌న్ కు అప్ప‌ట్లో ఎంతో క్రేజ్ ఉండేది. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య కూడా తండ్రీ కూతుళ్ల‌కు ఉండేంత ఏజ్ గ్యాప్ కూడా ఉండేది.

ఇవి కూడా చదవండి : Uday Kiran Sister Name: ఉద‌య్ కిరణ్ సోద‌రి టాలీవుడ్ టాప్ సింగ‌ర్ అన్న సంగ‌తి తెలుసా..! ఆమె ఎవ‌రంటే..?

Visitors Are Also Reading