Home » రీ ఎంట్రీ రెడీ అవుతున్న నలుగురు స్టార్ హీరోయిన్లు…!

రీ ఎంట్రీ రెడీ అవుతున్న నలుగురు స్టార్ హీరోయిన్లు…!

by AJAY
Ad

కొంతమంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి మళ్లీ రీ ఎంట్రీతో సక్సెస్ ను అందుకున్నారు. అయితే ఇప్పుడు మరి కొందరు భామలు కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అలా రీ ఎంట్రీ కి రెడీ అవుతున్న హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Genilia

Advertisement

హ హ హాసిని అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ జెనీలియా. ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గాఎదిగింది. సినిమాలు చేస్తున్న సమయంలోనే 2012లో బాలీవుడ్ హీరో రితేష్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. ఇద్దరు బాబులకు జన్మనిచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ జెనీలియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది. వేద్ అనే మరాఠీ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తిరిగి సినిమాలు చేయడం ప్రారంభిస్తోంది. ఈ సినిమాకు ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహించడం విశేషం.

Meera jasmeen

Advertisement

అందాలరాశి మీరాజాస్మిన్ కూడా రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. టాలీవుడ్ లో భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో మీరాజాస్మిన్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. 2014లో అనిల్ జాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఆ తర్వాత నాలుగైదు సినిమాలు కూడా చేసింది. అయితే ఇప్పుడు మీరాజాస్మిన్ మళ్లీ రీ ఎంట్రీ కి రెడీ అవుతోంది. పెళ్లికి ముందు ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన మీరజాస్మిన్ ఇప్పుడు గ్లామరస్ గా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తోంది. ఇప్పటికే మక్కల్ అనే మలయాళం సినిమాకు మీరాజాస్మిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ 2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత అనుష్క శర్మ సినిమాలకు దూరం అయింది. ఇప్పుడు అనుష్క శర్మ కూడా రీఎంట్రీ కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

సీనియర్ హీరోయిన్ రాధ కూడా రీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. రాధ వెంకటేష్, నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. యముడికి మొగుడు, రాముడు భీముడు లాంటి సూపర్ డూపర్ సినిమాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించింది. 1991లో రాజశేఖర్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని రాధ సినిమాలకు గుడ్బై చెప్పింది. ఇక ప్రస్తుతం తమిళ బుల్లితెరపై ఓ వినయ టీవీ షోకు రాధా జడ్జిగా వ్యవహరిస్తోంది. సినిమా ఆఫర్లు వస్తే నటించేందుకు కూడా ఆమె సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading