Home » ఈ ఏడాది తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరోయిన్లు ఎవ‌రో తెలుసా..?

ఈ ఏడాది తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరోయిన్లు ఎవ‌రో తెలుసా..?

by Bunty
Ad

2021 సంవ‌త్స‌రంలో చాలా మంది హీరోయిన్లు కొత్త‌గా సినిమా ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయ్యారు. వెండి తెర‌పై సంద‌డి చేశారు. వారిలో కొంద‌రు మంచి న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని బెస్ట్ డెబ్యూ హీరోయిన్లుగా మారితే.. మ‌రికొంద‌రు మాత్రం ఇలా వ‌చ్చి, అలా వెళ్లారు అన్న‌ట్టు క‌నిపించారు. ఇంత‌కీ 2021లో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన హీరోయిన్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం మ‌రి.

ప‌లు డ‌బ్బింగ్ సినిమాల‌తో తెలుగు జ‌నాల‌కు ప‌రిచ‌య‌మైన ఈ అమ్మ‌డు రామ్ పోతినేని న‌టించిన రెడం సినిమాలో హీరోయిన్‌గా క‌నిపించింది. ఆ త‌రువాత 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా..? అర్జున ఫాల్గుణ సినిమాల‌లో న‌టించింది అమృతా అయ్య‌ర్‌.

Advertisement

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా మారింది ఈ క్యూట్ బ్యూటీ. బేబ‌మ్మ పాత్రలో ఒదిగిపోయి న‌టించింది. ఈ సినిమా త‌రువాత వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటుంది. త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న నాని శ్యామ్ సింగ‌రాయ్ లో కూడా హీరోయిన్‌గా చేస్తుంది కృతిశెట్టి. చెక్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైంది. అనంత‌రం ఇష్క్ సినిమాలో కూడా న‌టించింది. ఈ సినిమాలేవి ఈమెకు క‌లిసి రాలేదు.

Advertisement

 

ఫ‌రియా అబ్దుల్లా సెన్షేష‌న‌ల్ హిట్ మూవీ జాతిర‌త్నాలులో హీరోయిన్‌గా న‌టించింది. చిట్టి పాత్ర‌లో న‌టించి అంద‌రిచేత వారెవ్వా అనిపించుకున్న‌ది. ఆ త‌రువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ లోనూ ఓ చిన్న రోల్ చేసింది. పెళ్లి సంద‌డి సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయింది క‌న్న‌డ బ్యూటి శ్రీ‌లీల, అందం, అభిన‌యంతో జ‌నాల‌ను ఆక‌ట్టుకుంది.అటు ర‌వితేజ‌తో ధ‌మ‌కా సినిమా కూడా చేస్తుంది.

రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది కేతికా శ‌ర్మ‌ . ఆ త‌రువాత ల‌క్ష్య  సినిమాలోనూ ఈమె సంద‌డి చేసింది. ఈ రెండు సినిమాలు కూడా అంత‌గా ఆక‌ట్టుకోలేదు . అదేవిధంగా రాజ‌శేఖ‌ర్‌-జీవిత పెద్ద కూతురు శివాని అద్భుత సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

 

Visitors Are Also Reading