ప్రస్తుత కాలంలో డబ్బు ఒక్కటి సంపాదిస్తే సరిపోదు. ఓవైపు డబ్బు సంపాదిస్తూనే మరోవైపు ఆ డబ్బును కాపాడుకునే ప్రయత్నం చేయకుంటే జీవితంలో విఫలం అవడం ఖాయం. ఎంత డబ్బు వచ్చినా దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వచ్చిన డబ్బును రెండింతలు చేసుకోవాలంటే ఎలాంటి పనులు చేయాలో తెలిసినవారే జీవితంలో ముందుకు వెళ్తారు. అలాంటిది సినిమా ఇండస్ట్రీలో ఈ హీరోయిన్స్ వారి నటన టాలెంట్ తో స్టార్ హీరోయిన్స్ గా మారారు.
Advertisement
రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు. కానీ ఈ హీరోయిన్స్ సినిమాలోనే కాకుండా వచ్చిన డబ్బుతో బిజినెస్ లు చేస్తూ చేతుల సంపాదిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతూ వావ్ అనిపించుకుంటున్నారు. ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
also read:ముత్యాల్లాంటి NTR చేతిరాత…ప్రింట్ కాదండోయ్!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే ఎక్కువ కాలం నిలవలేరు. మహా అయితే ఐదు నుంచి పది సంవత్సరాలు వారి గ్లామర్ ను కాపాడుకోగలరు. ఆ తర్వాత ఇండస్ట్రీ వీరిని ఆదరించదు. అలాంటి సమయంలోనే కెరియర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు చాలామంది హీరోయిన్లు బిజినెస్ లు స్టార్ట్ చేశారు. వారెవరో చూద్దాం.. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ ఫిట్నెస్ ఎక్స్పర్ట్.. తనకు వ్యాయామ శిక్షణలో భాగంగా ఫిట్నెస్ స్టూడియో నడుపుతున్నారు. అంతేకాకుండా
Advertisement
తమన్నా విషయానికి వస్తే ఈవిడ జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నారు. బంగారం అంటే ఇష్టపడే వారి కోసం అద్భుతమైన డిజైన్స్ అందిస్తూ ముందుకు వెళ్తున్నారు.
ఇక సమంత విషయానికి వస్తే చాలా రోజుల క్రితమే గార్మెంట్ బ్రాండ్ స్టార్ట్ చేశారు. అంతేకాకుండా తన బ్రాండ్ నేమ్ పై లగ్జరీ ఫ్యాషన్ డిజైనర్ వేర్స్ అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా హీరోయిన్ అలియా భట్ ఇప్పటికే కిడ్స్ వేర్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఆవిడ ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన ఆలోచన ప్రకారం ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇక కాజల్ భర్త గౌతమ్ కిచులుకి సొంతంగా ఫర్నిచర్ బిజినెస్ ఉంది. ఇక వివాహం అనంతరం గౌతమ్ కిచ్లు బ్రాండ్స్ కి ఆవిడే ప్రచారకర్తగా మారింది. అంతేకాకుండా
హీరోయిన్ ప్రణీత బెంగళూరులో ఇప్పటికే హోటల్ బిజినెస్ నడిపిస్తోంది. ఈ విధంగా సినిమాలు మరోవైపు బిజినెస్ లు చేస్తూ రెండు చేతుల కోట్ల రూపాయల సంపాదిస్తున్న హీరోయిన్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి.
also read: