సిని పరిశ్రమలో సక్సెస్ చాలా కీలకం. ముఖ్యంగా హీరోయిన్లకు గ్లామర్ కొంతవరకు కలిసొస్తుంది. కేవలం గ్లామర్ తో మాత్రమే ఎక్కువ రోజులు నిలబడలేరు. ముఖ్యంగా మంచి కథలు ఎంచుకుని విజయం సాధించాలి. అలా కెరీర్ ఆరంభంలో భారీ విజయం దక్కినప్పటికీ ఆ తరువాత బ్యాడ్ స్క్రిప్ట్‌లు ఎంచుకుని కెరీర్‌ను పాడు చేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నేహాశర్మ
Advertisement
రామ్‌చరణ్‌తో కలిసి చిరుత సినిమాలో నటించింది. టాలీవుడ్‌లో సాలిడ్ ఎంట్రి లభించింది. మెగాస్టార్ చిరంజీవి తనయుడి తొలిచిత్రం పూరిజగన్నాథ్ డైరెక్టర్.. ఇక హైప్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అనుకున్నవిధంగానే చిరుత విజయం సాధించింది. ఇక నేహాశర్మ అందాలకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ తరువాత ఆమె కెరీర్‌ను నిలబెట్టుకోలేక పోయింది. సరైన కథలు ఎంచుకోలేక కుర్రాడు అనే చిత్రం చేసింది. ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో నేహాశర్మకు టాలీవుడ్‌లో మరొక ఛాన్స్ రాలేదు.
అనిత
ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో నువ్వునేను ఒకటి. ఆ చిత్రంలో టాలీవుడ్ లోకి ఎంట్రిని ఇచ్చింది.అనిత హస్సానందిని కానీ ఆ తరువాత ఆమె శ్రీరామ్., తొట్టిగ్యాంగ్ లాంటి పసలేని కథలు ఎంచుకోవడంలో రేసులో వెనుకబడింది. క్రమంగా టాలీవుడ్ కి దూరమైపోయింది.
రక్షిత
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇడియట్ చిత్రంలో రక్షిత టాక్ ఆఫ్ ది బాస్‌గా మారింది. కానీ ఇడియట్ తరువాత రక్షిత కథల ఎంపిక విషయంలో పూర్తిగా చేతులు ఎత్తేసింది. నిజంఒం, ఆంధ్రావాలా లాంటి డిజాస్టర్లు పడ్డాయి. మధ్యలో శివమణి చిత్రం విజయం సాధించినా.. అందులో ఆమె సెకండ్ హీరోయిన్ రోల్‌కి పరిమితమైంది.
ఇషా చావ్లా
Advertisement
ప్రేమకావాలి చిత్రంలో మెమొరబుల్ హిట్ సొంతం చేసుకుంది. కుర్రాళ్లు ఫిదా అయ్యే గ్లామర్ ఆమె సొంతం. కానీ ఆ తరువాత వరుస ప్లాప్‌లతో టాలీవుడ్‌లో ఆమె కెరీర్ కూడా ముగిసింది.
కార్తీక
నాగచైతన్య జోష్ మూవీతో కార్తీక హీరోయిన్గా ఎంట్రి ఇచ్చింది. ఆ చిత్రం కాస్త నిరాశ పరిచింది. వెంటనే తమిళంలో రంగం చిత్రంతో బిగ్ హిట్ సొంతం చేసుకున్నది. ఆ తరువాత మళ్లీ దమ్ము లాంటి ప్లాపులు ఎదురయ్యాయి. దీంతో హీరోయిన్‌గా కార్తీక కెరీర్ ముగిసింది.
అను ఇమ్మాన్యుయేల్
అను ఇమ్మాన్యుయేల్‌కు అప్పుడప్పుడూ ఆఫర్లు వస్తున్నప్పటికీ ఆమె పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది. మజ్ణు చిత్రంతో హిట్ అందుకున్నప్పటికీ ఆ తరువాత వచ్చిన అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, మహాసముద్రం చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి.
నందిత
ప్రేమకథా చిత్రమం సినిమాలో నందిత నటనను ఎప్పటికీ మరిచిపోలేము. తన పెద్ద కళ్లతో హర్రర్ సన్నివేశాల్లో అద్భుతంఆ నటించింది. కానీ ఆ తరువాత నందితకు అంతగా కలిసి రాలేదు.న మంచి కథలు ఎంచుకోలేకపోయింది.
హెబ్బాపటేల్
కుమారి 21 ఎఫ్ చిత్రంలో కుర్రాలందరూ హెబ్బాపటేల్ జపం చేసారు. ఆమె క్రేజ్ చూసి తప్పకుండా టాఈలీవుడ్ టాప్ లీగ్ హీరోయిన్ల సరసన చేరుతుందని భావించారు. కానీ హెబ్బాపటేల్ బలమైన కథలు, పాత్రలు సెలెక్ట్ చేసుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం రష్మిక మందన్న, కృతిశెట్టి వంటి స్టార్ హీరోయిన్లు దూసుకెళ్లుతున్నారు. మరి వీరి పరిస్థితి ఏవిధంగా ఉంటుందో కొద్ది రోజులు వేచి చూడాలి.
AlsoRead: సోషల్ మీడియాలో కోహ్లీ కూతురు వామిక ఫోటోలు.. ఫ్యాన్స్ పుల్ ఖుషీ