కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కథ తో ఘోస్ట్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా హీరోయిన్ కష్టాలు ఎదుర్కొంటుంది. హీరోయిన్ గా ఎవరూ ఎంపిక అయినా.. కొంత భాగం షూటింగ్ చేసిన తర్వాత వాళ్లు ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారని తెలుస్తుంది. ముందుగా ఈ సినిమా నాగార్జున కు జోడీ గా కాజల్ అగర్వాల్ ను చిత్ర బృందం ఫైనల్ చేసింది.
Advertisement
Advertisement
అంతే కాకుండా కాజల్ పై కొన్ని యాక్షన్ సీన్స్ ను కూడా షూట్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. అనంతరం కాజల్ స్థానాన్ని అమలాపాల్ భర్తీ చేసింది. అమలాపాల్ పై కూడా కొన్ని సీన్స్ కూడా షూటింగ్ జరిపారని తెలుస్తుంది. అయితే అమలా పాల్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తుంది. తర్వాత హీరోయిన్ మెహ్రీన్ ను కూడా తీసుకోవాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ మెహ్రీన్ భారీగా పారితోషికం డిమాండ్ చేసిందని.. అందుకు చిత్ర బృందం నిరాకరించిదని తెలుస్తుంది.
దీంతో మరో సారి హీరోయిన్ వేట లో ఘోస్ట్ చిత్ర బృందం పడిందని సమాచారం. అయితే తాజా గా ఈ సినిమా లో హీరోయిన్ సోనాల్ చౌహాన్ నటించడానికి అంగీకరించిందని సమాచారం. త్వరలోనే ఆమె షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఒక గూఢచారి పాత్రలో ఉంటుంది. కొన్ని యాక్షన్స్ సీన్స్ లో నటించాల్సి ఉంటుంది. అలాగే నాగార్జున మాజీ రా అధికారి పాత్ర పోషిస్తున్నాడు.