Home » ఫ్లాపుల్లో ఉన్న హీరోలను స్టార్స్ చేసిన హీరోయిన్ శృతిహాసన్.. ఆ 7 సినిమాలు ఇవే..!!

ఫ్లాపుల్లో ఉన్న హీరోలను స్టార్స్ చేసిన హీరోయిన్ శృతిహాసన్.. ఆ 7 సినిమాలు ఇవే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

శృతిహాసన్ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోయిన్. తన తండ్రి కమలహాసన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించిన హీరో.ఆయన అడుగుజాడల్లో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ శృతి తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అంతే కాకుండా పాటలు డాన్స్ కూడా చేస్తుంది. దీంతో కాకుండా మ్యూజిక్ మరియు డబ్బింగ్ కూడా చెప్పగల టాలెంట్ ఉన్న హీరోయిన్. స్టార్ డమ్ మాత్రం ఈమె సొంత టాలెంట్ తోని సంపాదించుకుంది. మొదట్లో ఈమె ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు సినిమాలన్నీ ఫ్లాఫ్ అయ్యేవి. దీంతో ఈ హీరోయిన్ ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతుందనే బ్రాండ్ పడింది. ఆమె సినిమాలు ఫ్లాప్ అయినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గకుండా మరింత పెరుగుతూనే వచ్చింది. ఈ హీరోయిన్ కు తగ్గట్టు పాత్ర సరిగా అందలేదని దాని కోసం కొంత టైమ్ పట్టింది అని హరీష్ శంకర్ ఫ్రూ చేసాడు. ఇక అప్పటి నుంచి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మారిపోయింది. ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్న హీరోలతో జతకట్టి వారికి సక్సెస్ అందించింది. ఈ విధంగా లక్కీ హీరోయిన్ అయిపోయింది శృతిహాసన్. మరి ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం..

గబ్బర్ సింగ్ :

Advertisement

హీరో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్న తరుణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ చేసింది. ఆమెకు ఇది మొదటి బ్లాక్ బస్టర్ హిట్.

రామ్ చరణ్:

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు ముందు రామ్ చరణ్ నటించిన తుఫాన్ ఇంకా వేరే సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఆ తర్వాత ఎవడు సినిమాలో శృతి హాసన్ తో జతకట్టిన రామ్ చరణ్ హిట్ అందుకున్నాడు.

రవితేజ :

Advertisement

దేవుడు చేసిన మనుషులు నిప్పు, వీర, దరువు వంటి సినిమాలు వరుస ప్లాపులు వచ్చాయి. ఈ తరుణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన బలుపు సినిమాలో రవితేజ తో శృతి హాసన్ జతకట్టింది. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

విశాల్ :

తెలుగు ఇండస్ట్రీలో పూజ చిత్రంతో మంచి హిట్ కొట్టాడు హీరో విశాల్. ఈ సినిమాకు ముందు ఆయన వరుస ప్లాపులతో సతమతం అవుతూ వచ్చారు. పూజ మూవీ లో శృతి హాసన్ తో జతకట్టి సూపర్ హిట్ కొట్టారు.

అల్లు అర్జున్ :

ఇద్దరమ్మాయిలు మూవీ తీవ్ర డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రేసుగుర్రం సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా జత కట్టారు. దీంతో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోయింది.

నాగ చైతన్య :

దోచేయ్,ఆటోనగర్ సూర్య వంటి వరుస సినిమాలు ఫ్లాప్ గా వచ్చిన సమయంలో, ప్రేమమ్ రూపంలో నాగచైతన్యతో శృతిహాసన్ జంటగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

మహేష్ బాబు:

ఆగడు, వన్ నేనొక్కడినే వంటి వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న తరుణంలో వచ్చిన మూవీ శ్రీమంతుడు. కొరటాల శివ దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా మహేష్ బాబు తో జత కట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ALSO READ;

సుధీర్-రష్మీల ప్రేమపై గెటప్ శ్రీను సంచలన కామెంట్స్..అందుకే జబర్దస్త్ వదిలేశారట..?

SaiPallavi : ఆ లవ్ లెటర్ వల్లే మా పేరెంట్స్ నన్ను చావగొట్టారు..!!

Visitors Are Also Reading