Home » నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక జీవితంలో అన్ని క‌ష్టాలు అనుభవించిందా…? చివ‌రికి ఇంటి అద్దె కూడా కట్ట‌లేక‌..!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక జీవితంలో అన్ని క‌ష్టాలు అనుభవించిందా…? చివ‌రికి ఇంటి అద్దె కూడా కట్ట‌లేక‌..!

by AJAY

కిరిక్ పార్టీ సినిమాతో కన్నడనాట హీరోయిన్ గా పరిచయమైన బ్యూటీ రష్మిక మందన. మొదటి సినిమాతోనే రష్మిక సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత సాండిల్ వుడ్ లో ఆఫర్లు వచ్చినప్పటికీ టాలీవుడ్ లో అడుగు పెట్టింది. తెలుగులో నాగశౌర్య హీరోగా నటించిన ఛ‌లో సినిమాలో అతడికి జోడిగా నటించి సూపర్ హిట్ అందుకుంది. ఛ‌లో సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం సినిమాలో నటించే ఛాన్స్ ను ర‌ష్మిక‌ అందుకుంది.

ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రష్మిక తన కెరీర్ లో తిరిగి చూసుకోలేదు. రీసెంట్ గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. అంతేకాకుండా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకు జోడిగా నటించి మెప్పించింది. ఇక‌ ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లోనూ ఓ సినిమాలో నటిస్తోంది. ఇక తెలుగులో అయితే ఫుల్ బిజీగా ఉందని చెప్పాలి. విజయ్ హీరోగా న‌టిస్తున్న పాన్ ఇండియా సినిమా వార‌సుడు లో హీరోయిన్ గా న‌టిస్తోంది.

మ‌రో వైపు పుష్ఫ పార్ట్ 2 లోనూ ర‌ష్మిక హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతే కాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ కు జోడీగా కూడా ఓ సినిమాలో న‌టించే ఛాన్స్ ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక‌ ఇప్పుడు వరుస ఆఫర్లతో కోట్లు సంపాదిస్తున్న రష్మిక ఒకప్పుడు మాత్రం జీవితంలో చాలా కష్టాలు చూసానని ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించింది.

చిన్నతనంలో ఆర్థిక కష్టాలను అనుభవించాన‌ని రష్మిక చెప్పుకొచ్చింది. ఇంటి వద్ద అద్దె క‌ట్టలేక‌ 2 నెలలకు ఒకసారి ఇల్లు మారేవారిమని తెలిపింది. అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందుల‌తో తన తండ్రి ఒక బొమ్మను కూడా కొన్ని ఇవ్వలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది.

Visitors Are Also Reading