Home » విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌కు క‌రోనా పాజిటివ్

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌కు క‌రోనా పాజిటివ్

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ క‌రోనా బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని ఆమె త‌న ఇన్‌స్టా వేదిక‌గా అభిమానుల‌కు వెల్ల‌డించింది. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ క‌రోనా పాజిటివ్ అని తెలిపింది. ప్ర‌స్తుతం ఐసోలేష‌న్‌లో ఉన్నానని, వైద్యుల సూచ‌న మేర‌కు మందులు వాడుతున్నాను. ద‌య‌చేసి ఇటీవ‌ల కాలంలో న‌న్ను క‌లిసిన వారంద‌రూ కూడా కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరింది ప్రియాంక జ‌వాల్క‌ర్‌.

Priyanka Jawalkar Jewellery Accessories from Maate Vinadhuga, Taxiwala,  2019 Celebrity Jewellery | Charmboard

Advertisement

Advertisement

ఎవ్వ‌రూ కూడా నెగ్లిట్ చేయ‌కూడ‌దు, నేను చెబుతున్నాను. ద‌య‌చేసి అంద‌రూ మాస్క్‌లు ధ‌రించుకోండి. అవ‌స‌రం అయితే త‌ప్ప.. అస్స‌లు బ‌య‌టికి రాకండి. చాలా జాగ్ర‌త్త‌గా ఉండండి అని సూచించారు. ఇకపోతే ప్రియాంక రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన టాక్సీవాలా చిత్రంలో తెలుగు తెర‌కు ప‌రియ‌మైంది. ఈ చిత్రం విజ‌యం సాధించ‌డంతో ఈ అమ్ముడు మంచి అవ‌కాశాల‌నే అందుకుంది. తిమ్మ‌రుసు ఎస్‌.ఆర్‌.క‌ల్యాణ‌మండ‌పం లాంటి చిత్రాల‌లో ద‌గ్గ‌ర అయింది. తాజాగా ప్రియాంక మ‌రొక రెండు సినిమాల‌లో న‌టిస్తోంది. ప్రియాంక కోవిడ్ బారిన ప‌డింద‌ని తెలుసుకున్న అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading