Telugu News » Blog » శ్ర‌ద్దా వాక‌ర్ లాంటి ప‌రిస్థితే నాకు కూడా..? బాల‌య్య హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

శ్ర‌ద్దా వాక‌ర్ లాంటి ప‌రిస్థితే నాకు కూడా..? బాల‌య్య హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by AJAY
Ads

రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్ ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రేమించిన వాడే శ్రద్ధ వాకర్ అనే యువ‌తిని అతి దారుణంగా హతమార్చి ముక్కలు ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో ప‌డేశాడు. అయితే తాజాగా టాలీవుడ్ నటి ఫ్లోరా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫ్లోరా అంటే ప్రేక్షకులకు గుర్తుండకపోవచ్చు కానీ నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆశ పాత్రలో నటించిన నటి అంటే గుర్తుపట్టేస్తారు. టాలీవుడ్ లో నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో పాటు నరసింహనాయుడు, సొంతం, ప్రేమ‌తో రా సినిమాల్లో ఫ్లోరా నటించింది.

Advertisement

 

అయితే నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆశ పేరుతో ఎక్కువమంది కి గుర్తుండిపోయింది. మరి కొన్ని సినిమాలు చేసినా ఆ త‌ర‌వాత‌ అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ కు దూరమైంది. తాజాగా ఫ్లోరా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టింది. శ్రద్దా వాకర్ కు ఎలాంటి పరిస్థితి ఎదురయిందో తనకు కూడా అలాంటి పరిస్థితి జరిగిందని చెప్పింది.

Advertisement

తన బాయ్ ఫ్రెండ్ తనను తన కుటుంబం నుంచి దూరం చేసాడు అని చెప్పింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే అతనిలో చాలా మార్పులు కనిపించాయని చెప్పింది. తన కోసం అందరినీ వదిలేసి వస్తే తనను తీవ్రంగా హింసించేవాడని తెలిపింది. పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తించేవాడని…. ఎందుకు కొడుతున్నాడో కూడా అర్థం అయ్యేది కాదని తెలిపింది.

Advertisement

అతడు కొట్టిన దెబ్బలకు తన దవడ విరిగిందని.. ఒకరోజు కొట్టడమే కాకుండా చంపేస్తా అంటూ బెదిరించాడ‌ని తెలిపింది. దాంతో తాను ప్రాణ భయంతో పరుగులు తీశాన‌ని చెప్పింది. అప్పుడే తన తల్లి వచ్చిందని దాంతో త‌ల్లితో క‌లిసి వెంట ఇంటికి వెళ్లాన‌ని తెలిపింది. అలా తానుప్రాణాలతో బయటపడ్డాన‌ని… ఆ తర్వాతరోజు బాయ్ ఫ్రెండ్ పై కేసు పెట్టిన‌ట్టు వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఫ్లోరా చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.