Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ఆ నిర్మాత నన్ను, నా ఫ్యామిలీని బెదిసిస్తున్నాడు : హీరోయిన్

ఆ నిర్మాత నన్ను, నా ఫ్యామిలీని బెదిసిస్తున్నాడు : హీరోయిన్

by AJAY
Published: Last Updated on
Ads

షార్ట్ ఫిలింస్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని సినిమా అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్ చాందినీ చౌదరి. కలర్ ఫోటో సినిమా ద్వారా చాందినీ చౌదరి టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా ఓటిటిలో ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో సునీల్ విలన్ గా నటించారు. ఇక ఈ చిత్రంలో చాందిని నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటోంది.

Advertisement

Ad

ప్రస్తుతం చాందిని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సమ్మతమే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జూన్ 24న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ చాందిని ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ నిర్మాత మీ కెరీర్ ను ఆగిపోయేలా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. దాని పై మీ స్పందన ఏమిటి అంటూ చాందినిని యాంకర్ ప్రశ్నించారు. దానికి ఆమె సమాధానం ఇస్తూ… నన్ను ఇండస్ట్రీలో కనబడకుండా చేస్తానని ఓ నిర్మాత బెదిరించాడు.

Advertisement

నాతో పాటు నా ఫ్యామిలీని కూడా భయపెట్టాడు. చివరికి నిర్మాత నాతో సైన్స్ చేసుకున్న కాంట్రాక్టు వ్యాలిడిటీ కాదని తెలిసింది. అంటూ చాందిని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే అలా జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలను ఎందుకు సంప్రదించలేదు అని ప్రశ్నించగా.. ఎవరి దగ్గరికి వెళ్ళాలి..? నన్ను నేను బ్యాకప్ చేసుకోవడానికి నా దగ్గర ఏముంది…? అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం చాందినిని ఇబ్బంది పెట్టిన నిర్మాత ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు

Visitors Are Also Reading