Home » నిత్యామీనన్:ఎంత పని చేశావమ్మ..పెళ్లి కాకుండానే గర్భం..!!

నిత్యామీనన్:ఎంత పని చేశావమ్మ..పెళ్లి కాకుండానే గర్భం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో కొంతమంది స్టార్ నటులు పెళ్లి కాకుండానే గర్భం దాల్చి అందరినీ షాక్ కు గురి చేస్తున్నారు. ఆ బాటలోనే నడిచింది మలయాళ బ్యూటీ నిత్యామీనన్.. ఆమె గర్భం దాల్చడం చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు. పెళ్లి కాకుండానే తల్లి కావటం ఏంటమ్మా అంటూ నోరేళ్లబెడుతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. నిత్యామీనన్ మలయాళ బ్యూటీ అయిన కానీ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అలా మొదలైంది అనే సినిమాతో ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ అమ్మడు తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఆమె మొదటి సినిమా విజయవంతం కావడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలాగే ఈ సినిమాతో హీరో నానికి కూడా మంచి పేరు వచ్చింది.

Advertisement

also read:నూడుల్స్ తో పకోడి ఇలా చేయండి.. రుచితో పాటు ఆరోగ్యకరం కూడా..!

ఆ తర్వాత నితిన్ హీరోగా నిత్యామీనన్ హీరోయిన్ గా ఇష్క్ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో అభిమానులకు మరింత దగ్గరయింది. వరుస ఫెయిల్యూర్స్ తో బాధపడుతున్న నితిన్ కు లక్కీ గర్ల్ గా మారింది నిత్య. ఆ తర్వాత “గుండెజారి గల్లంతయింది” అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి,జనతా గ్యారేజ్ వంటి సినిమాలతో ఎన్టీఆర్, బన్నీలతో జతకట్టింది. ఈ రెండు సినిమాల్లో ఆమెది సెకండ్ రోల్ హీరోయిన్ కావడం విశేషం.

ఈ విధంగా మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న నిత్యామీనన్ “వండర్ ఉమెన్” టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేశారు. ఇది జి 5లో నవంబర్ 18 నుండి స్ట్రీమ్ కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో నిత్యామీనన్ ప్రెగ్నెంట్ ఉమెన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సిరీస్ కి ప్రచారం కల్పించడం కొరకు ప్రెగ్నెంట్ తో ఉన్న గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి ఓ కామెంట్ పెట్టారు. ప్రెగ్నెంట్ లుక్ అంత క్యూట్ గా ఉండదు. ప్రెగ్నెంట్ ఉమెన్ నోరా పాత్ర చేయడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. వండర్ ఉమెన్ షూటింగ్లో తీసిన ఫోటోలు ఇంకా షేర్ చేస్తాను..నోట్ : నేను నిజంగా ప్రెగ్నెంట్ కాదు అంటూ కామెంట్ చేసింది. ఈ విధంగా నిత్యామీనన్ పెట్టిన ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి.

also read:

Visitors Are Also Reading