Jayasudha Marriage: అలనాటి స్టార్ హీరోయిన్ జయసుధ అంటే తెలియని వారు ఉండరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ,శోభన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ పంచుకుంది ఈ సీనియర్ హీరోయిన్. ఆరు పదుల వయసులో కూడా ఇప్పటికీ కొన్ని సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకుంటుంది. ఈ మధ్యకాలంలో జయసుధ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. జయసుధ తన భర్తను కోల్పోయిన తర్వాత ఆ బాధను మర్చిపోవడానికి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీ అయిపోయింది.
Advertisement
also read:టాలీవుడ్ లో అత్యంత ధనిక హీరోలు ఇద్దరే.. ఎన్ని కోట్ల ఆస్తులంటే..?
Advertisement
అలాంటి జయసుధ పెళ్లి గురించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ ఆమె పెళ్లి చేసుకోబోతోందని అనేక వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే స్పందించిన జయసుధ మాట్లాడుతూ.. చాలామంది నాకు పెళ్లయిపోయిందంటూ పోస్టులు కూడా పెడుతున్నారు, అంతేకాకుండా నేను ఒంటరితనాన్ని భరించలేక పోతున్నానని రెండో పెళ్లి చేసుకుంది అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.. ఇది కరెక్ట్ కాదు అంటూ బాధపడింది. తనపై తప్పుడు ప్రచారాన్ని చేయవద్దు అంటూ మండిపడింది.
సినిమాల్లో బిజీ కావడం వల్ల ఒంటరితనం నుంచి ఉపశమనం పొందుతున్నానని, అలాంటి నాపై ఇలా తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆరోపణలు చేసింది. తాజాగా ఆమె బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో పాల్గొంది.. ఏది ఏమైనా తనపై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని, తాను పెళ్లి చేసుకోవట్లేదని క్లారిటీ ఇచ్చింది సీనియర్ హీరోయిన్.
Advertisement
also read: