కొంతమంది హీరోలు నటించడమే కాకుండా అదనంగా మరికొన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అడవిశేష్, నవీన్ పొలిశెట్టి, కిరణ్ బొప్పవరం దర్శకులు కాదు.. హీరోలే కథలు రాసుకున్నారు.
Advertisement
Ad
తమ కోసం తామే కథలు రాసుకొని హీరోలుగా మారుతున్నారు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీకి వస్తున్న దర్శకుడికి కథలు రాసే అలవాటు ఉంటే సినిమా చాలా బాగా వస్తుందని అంటున్నారు.
దర్శకుడు అయితే ఉండే లాబాలు వేరు. అందుకే పూరిజగన్నాథ్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు తమ సినిమాలకు తామే కథలు రాసుకుంటున్నారు. ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి అటు హీరోగా నటిస్తూనే ఇటు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. అలాగే కిరణ్ అబ్బవరం ఎస్ఆర్ కల్యాణమండపంకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఆయనవే.
అదేవిధంగా సిద్దు జొన్నల గడ్డ కృష్ణ అండ్ హిస్ లీల కథ, స్క్రీన్ ప్లే అందించారు. ముఖ్యంగా హీరో అడవి శేషు క్షణం సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. అలాగే గూఢాచారి కి కూడా అడవి శేషు కథ, స్క్రీన్‌ప్లే, ఎవరు స్క్రీన్ ప్లే అందించి నటించి, కథ, స్క్రీన్ ప్లే అందించిన హీరోలో లిస్ట్‌లో ముందంజలోకి దూసుకెళ్లుతున్నారు అడవిశేషు. ఇక పాత కాలం నుంచి ఇప్పటి వరకు ఆర్.నారాయణమూర్తి ఏకంగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ తానై సినిమాను నడిపిస్తుంటాడు. అలాగే కొన్ని సినిమాలకు సంగీతం కూడా అందించారు ఆర్. నారాయణమూర్తి. ఆర్.నారాయణమూర్తి తరువాత ప్రస్తుతం అడవిశేషు, నవీన్ పొలిశెట్టి, కిరణ్ బొప్పవరం ఆ జాబితాలోకి మెల్లగా చేరుతున్నారు.
Advertisement
Also Read: బాలకృష్ణ “భైరవద్వీపం” సినిమాకు పని చేసిన తమన్..జీతం ఎంతో తెలుసా..?