Home » ఆదిత్య 369 సినిమా ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా…? ఎందుకు రిజెక్ట్ చేశాడంటే….?

ఆదిత్య 369 సినిమా ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా…? ఎందుకు రిజెక్ట్ చేశాడంటే….?

by AJAY

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలయ్య ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. నందమూరి తారక రామారావు వారసుల్లో బాలయ్య ఒక్కడే స్టార్ హీరోగా ఎదిగారు. హరికృష్ణ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కొన్ని సినిమాలు మాత్రమే చేశారు. ఇక బాలయ్య తన తండ్రి నట ప్రస్తానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు రాజకీయాల్లోనూ బాలయ్య రాణిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక బాలకృష్ణ రాజకీయాల కంటే సినిమాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఎన్టీఆర్ మాదిరిగానే బాలయ్య కూడా పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి మెప్పించారు. బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో ఆదిత్య 369 కూడా ఒకటి. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు.

సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. టైం ట్రావెల్ కతాంశంతో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదట శ్రీకృష్ణదేవరాయలు పాత్ర కోసం కమల్ హాసన్ ను అనుకున్నారట. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కమల్ హాసన్ కు కథ వినిపించగా ఆయన ఓకే చెప్పారు.

కానీ ఆ తర్వాత డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో కమల్ హాసన్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత సింగీతం మరికొందరు హీరోలను వెతికే పనిలో పడ్డారు. కానీ చివరికి ఎవరూ సెట్ అవ్వకపోవడంతో బాలయ్యనే ఈ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్రను సైతం పోషించేలా సెట్ చేసారు. అలా కమల్ హాసన్ ఈ పాత్రనుండి తప్పుకోగా బాలయ్య తన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ సినిమా గా కూడా నిలిచింది.

Visitors Are Also Reading