Telugu News » కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌కు క‌రోనా పాజిటివ్‌..!

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌కు క‌రోనా పాజిటివ్‌..!

by Anji

క‌రోనా మ‌రొక‌సారి భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తుంది. సెకండ్ వేవ్ గ్యాప్ ఇచ్చిన క‌రోనా ఇప్పుడు మ‌రొక‌సారి కోర‌లు చాస్తోంది. కేసులు విప‌రీతంగా పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వ‌ర‌కు అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు. సినిమా తార‌ల‌కు క‌రోనా సోక‌డంతో అభిమానులు ఆందోళ‌న ప‌డుతున్నారు. టాలీవుడ్‌లో ఇప్ప‌టికే .. బీటౌన్ లో ఏక్తాక‌పూర్‌, అర్జున్ క‌పూర్‌, స్వ‌రా భాస్క‌ర్ సింగర్ విశాల్ డ‌డ‌లానీతో పాటు టాలీవుడ్‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు, మ‌నోజ్, త‌మ‌న్‌, త్రిష‌, వ‌ర‌ల‌క్ష్మీ, శ‌ర‌త్ కుమార్, రీసెంట్‌గా రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇలా అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా త‌మిళ న‌టుడు, నిర్మాత విష్ణు విశాల్ క‌రోనా బారిన ప‌డ్డారు.

Ads

Actor Vishnu Vishal: కోలీవుడ్‌లోనూ కరోనా కలకలం.. హీరో విష్ణు విశాల్‌కు పాజిటివ్..తాను క‌రోనా బారిన ప‌డిన విష‌యాన్ని ఆయ‌నే స్వయంగా తెలిపారు. ఈమేర‌కు విష్ణు విశాల్ ట్వీట్ చేసారు. నాకు క‌రోనా పాజిటివ్ గా నిర్థార‌ణ అయింది. కొద్ది రోజులుగా న‌న్ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా టెస్ట్‌లు చేయించుకోవాలని కోరాడు. ఒల్లు నొప్పులు, జ‌లుబు, లైట్‌గా జ్వ‌రం ఉన్న‌ద‌ని తొంద‌ర‌లోనే కోలుకుంటా అని ప్ర‌క‌టించాడు విశాల్‌. ఆయ‌న‌తో క‌లిసి దిగిన ఫొటోను షేర్ చేసాడు.దీంతో ర‌వితేజ అభిమానుల్లో ఆందోళ‌న‌మొద‌లైన‌ది. ర‌వితేజ అభిమాని దీని గురించి ప్ర‌శ్నించ‌గా ఆ ఫొటో పాత‌ది అని క్లారిటీ ఇచ్చాడు విష్ణు విశాల్‌.


You may also like