తమిళనాట రాజకీయాల్లో సినీ తారల ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకూ పలువురు సినీతారలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. జయలలిత లాంటి వారు సక్సెస్ అవ్వగా రజినీ కాంత్ లాంటి హీరోలు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించి మధ్యలోనే డ్రాప్ అయ్యారు. అంతే కాకుండా కమల్ హాసన్ లాంటి హీరో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ సక్సెస్ అవ్వలేకపోయారు. కాగా మరి కొందరు రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అనుకున్న మేర విజయం సాధించారు. అయితే ప్రస్తుతం తమిళ నాట హీరోగా ఉన్న విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తుంది.
Advertisement
Advertisement
త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరొపారి విజయ్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా విజయ్ పొలిటికల్ పేరును ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై విజయ్ పీఆర్ ఓ టీం తాజాగా స్పందించింది. ఆ వార్తలు అన్నీ అవాస్తవం అని స్పష్టం చేసింది. ఎలక్షన్ కమిషన్ వద్ద విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించారని వస్తున్న వార్తలు నిజం కాదని విజయ్ పీఆర్ఓ రియాజ్ అహ్మద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.