Home » గల్లా అశోక్ ‘హీరో’ ట్రైల‌ర్ ఎలా ఉందంటే..?

గల్లా అశోక్ ‘హీరో’ ట్రైల‌ర్ ఎలా ఉందంటే..?

by Anji
Ad

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం హీరో . శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన ఈ సినిమాలో అశోక్ స‌ర‌స‌న హాట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఇక సంక్రాంతి బ‌రిలోకి రానున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను తాజాగా ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి విడుద‌ల చేశారు. ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌ల పాట‌లు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

hero

Advertisement

చిన్న‌ప్ప‌టి నుంచి హీరో అవ్వాల‌నుకునే ఒక కుర్రాడు అత‌నికి స‌పోర్ట్ చేసే త‌ల్లి, తిర‌స్క‌రించే తండ్రి, వీరి మ‌ధ్య‌లో న‌లిగిపోతూనే హీరో వేషాల కోసం తిరుగుతుండే కుర్రాడికి ప‌క్కింట్లో అద్దె కూడా హీరోయిన్ ప‌రిచ‌యం అవుతుంది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి చివ‌రికీ హీరోయిన్ తండ్రి వ‌ద్ద‌కు వెళ్లుతుంది. దీంతో హీరోకు, హీరోయిన్ తండ్రికి మ‌ధ్య గొడ‌వ మొద‌ల‌వుతుంది. వీరి మ‌ధ్య‌లోకి మాఫియా దిగుతుంది. చివ‌రికీ ఆ కుర్రాడు హీరోగా మారాడా..? హీరోయిన్ ప్రేమను ద‌క్కించుకున్నాడా..? అనేది వెండి తెర‌పై చూడాలి.

Advertisement

క‌థ కొంచెం కామ‌న్‌గా ఉన్నా శ్రీ‌రామ్ ఆదిత్య టేకింగ్ కొత్త‌గా ఉంద‌ని ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. మ‌ధ్య‌లో కౌబాయ్‌గా హీరోని చూపించి సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, మ‌హేష్‌బాబును గుర్తు చేశారు. హీరోగా అశోక్ గ‌ల్లా మొద‌టి సినిమానే అలా ఎక్క‌డ ట్రైల‌ర్ లో క‌నిపించ‌లేదు. గిబ్రాన్ మ్యూజిక్ ట్రైల‌ర్ కు ప్ల‌స్ అని చెప్ప‌వ‌చ్చు. ఇక నిధి అందాలు, హీరోతో లిప్ కిస్సులు చూపించి రొమాంటిక్ యాంగిల్ ఉన్న‌ట్టు చూపించారు. మొత్తానికి హీరో ట్రైల‌ర్ లో చెప్పిన‌ట్టే యాక్ష‌న్‌, రొమాన్స్, థ్రిల్ల‌ర్ మిక్స్ చేసి చూపించారు. జ‌న‌వ‌రి 15న విడుద‌లవుతున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఎలా ఆక‌ట్టుకోనున్న‌దో చూడాలి మ‌రీ.

Visitors Are Also Reading