Home » మహేష్ బాబు సినిమాలో మరో హీరో..!

మహేష్ బాబు సినిమాలో మరో హీరో..!

by Azhar
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా అనేది చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనేది వీరిద్దరూ ఎప్పుడో ప్రకటించారు. కానీ దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఏం ఇవ్వడం లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా ఆరంభం కాలేదు అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఈ నెల ఆరంభంలోనే ప్రారంభించాలి అని అనుకున్నారు.

Advertisement

కానీ సరిగా అడిగే సమయంలో టాలీవుడ్ నిర్మాతలు షూటింగ్స్ ఆపాలని పిలుపు ఇవ్వడంతో ఈ సినిమా అనేది ప్రారంభం కాలేదు. ఇక మహేష్ బాబు పుట్టిన రోజున అయిన ఏదైనా అప్డేట్ వస్తుంది అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. కానీ తాజాగా ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త అనేది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో మరో హీరో నటించబోతున్నాడు అని తెలుస్తుంది.

Advertisement

మహేష్ బాబు , త్రివిక్రమ్ సినిమాలో హీరో వేణు తొట్టెంపూడి నటిస్తున్నాడు ఎప్పుడో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆయన కాకుండా మరో హీరో నటించబోతున్నాడు అని తెలుదుతుంది. అది ఎవరంటే.. ఒక్కప్పటి లవర్ భాయ్.. ఇప్పటికి అలాగే నిలిచి పోయిన హీరో తరుణ్. అవును హీరో తరుణ్ మహేష్ బాబు సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడు అని తెలుస్తుంది. కానీ అది ఏ పాత్ర అనేది తెలియడం లేదు.

ఇవి కూడా చదవండి :

జెండాను వద్దన్న జై షా.. ఎందుకో తెలుసా..?

పరుగులు చేసిన కోహ్లీకి తప్పని విమర్శలు..!

Visitors Are Also Reading