తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగారు హీరో సుమన్. అలాంటి సుమన్ కు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇండస్ట్రీలో మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేసిందే సుమన్. అలాంటి సుమన్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.. అలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఒక చిన్న ఇష్యూ వల్ల సుమన్ సినీ కెరియర్ డౌన్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా ..పలు రకాల పాత్రలు చేస్తూ వస్తున్నారు..
Advertisement
Advertisement
1977లో తమిళంలో నటించిన నీచల్ కులం అనే చిత్రం ద్వారా ఇంట్రెస్ట్ లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వరుస ఆఫర్లు రావడంతో స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి సుమన్ పోలీస్ పాత్రలు చేయడంలో దిట్టా అని చెప్పవచ్చు. దాదాపుగా అన్ని భాషలతో కలిపి 140 చిత్రాల్లో నటించారు. కొన్ని సమయాల్లో చిరంజీవితో కూడా పోటీపడి సినిమాలు తీశారు. ఈ తరుణంలోనే ఏవో కారణాలవల్ల జైలుకు వెళ్లడం తర్వాత బయటకు రావడం చక చకా జరిగిపోయాయి.
ఆయన కెరియర్ లేదు అనుకున్న సమయంలో శిరీష అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈమె ఎవరో కాదు ప్రముఖ రైటర్ నరసరావు మనవరాలు. శిరీష హీరోయిన్లకు మించి అందంగా ఉంటుంది.. ప్రస్తుతం సుమన్ పెళ్లికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Advertisement
also read:ఉదయ్ కిరణ్ చేసిన ఆ తప్పే ఆయన జీవితాన్ని బలి తీసుకుందా..?