టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ భారత జవాన్ల కోసం 117 ఎకరాల భూమిని దానం చేశారు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి సుమన్ ఈ భూమిని డొనేట్ చేసింది ఇప్పుడు కాదు. రెండేళ్ల క్రితమే సుమన్ భూమిని జవాన్ల కోసం దానం చేశారు. నిజానికి సుమారు 175 ఎకరాల భూమిని సుమన్ జవాన్ల కోసం దానం చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కోర్టు కేసుల వల్ల 117 ఎకరాలు సుమన్ పేరిట పట్టా అయ్యింది. దాంతో సుమన్ ఆ భూమి మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.
Advertisement
Advertisement
ఇదిలా ఉంటే సుమన్ జవాన్ల కోసం భూమిని విరాళంగా ఇవ్వడానికి ఓ కారణం కూడా ఉంది. దానిని గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తను సంపాదించిన ఆస్తిలో సైనికుల కోసం భూమిని ఇవ్వటం త్యాగం అని అనుకోవడం లేదని భావిస్తున్నట్టు సుమన్ తెలిపారు. అందుకే దేశాన్ని రక్షించే సైనికుల కోసం భూమిని ఇచ్చానని చెప్పారు. కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు సాయం చేయాలని అనుకున్నప్పుడు అందరూ స్పందించి రెండు లక్షలు, ఐదు లక్షలు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చేశారని చెప్పారు. ఆ సందర్భంలో మీడియా వాళ్లు మీరు ఏం చేస్తారు అని అడిగినప్పుడు నేను మా ఇంటికి ఫోన్ చేసి అడిగానని తెలిపారు. అయితే తన భార్య ఈ భూమిని డొనేట్ చేద్దామని చెప్పినట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం ఈ భూమి పై కేసు నడుస్తోందని సైనికులకు దానం చేస్తామని సుమన్ చెప్పారు.
తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం… చాలా సినిమాల షూటింగ్ సమయంలో దేశ సైనికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చూశానని చెప్పారు. సరిహద్దులో జవాన్లు ఇంటిని కుటుంబాన్ని వదిలి మనల్ని రక్షిస్తున్నారని అన్నారు. మనకోసం జీవితాన్ని త్యాగం చేసి బార్డర్ లో ఉంటున్నారని వ్యాఖ్యానించారు. సైనికులను చూసినప్పుడు వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపించిందని అందుకోసమే భూమి విరాళంగా ఇచ్చానని వ్యాఖ్యానించారు.