టాలీవుడ్ హీరో రాజశేఖర్ మెదట డాక్టర్ గా కెరీర్ ను ప్రారంభించి ఆ తరవాత నటుడిగా ఎంట్రీ ఇచ్చారన్న సంగతి తెలిసిందే. అయితే రాజశేఖర్ డాక్టర్ కావడం వల్ల షూటింగ్ జరుగుతున్న సందర్భంలో అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం నుండి వ్యక్తి ప్రాణాలను కాపాడారట. ఈ విషయాన్ని సీనియర్ నిర్మాత పోకూరి బాబూ రావు ఓ ఇంర్వ్యూలో వెల్లడించారు. పోకూరి రామారావు మాట్లాడుతూ…రాజశేఖర్ తో నవభారతం సినిమా తీస్తున్న సందర్భంగా ఓ ఘటన చోటు చేసుకుందని చెప్పారు.
గుంటూరు దగ్గర్లోని ఓ విలేజ్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ కోసం ఓ డమ్మీ పిస్టల్ ను మద్రాస్ నుండి తెప్పించామని అన్నారు. ఉదయం షూటింగ్ ప్రారభించేముందు పీఎల్ నారాయణ అనే వ్యక్తి ఓ జూనియర్ ఆర్టిస్ట్ ను ఆ పిస్టల్ తో బెదిరించడం ప్రారంభించారని అన్నారు. దాంతో ఆ జూనియర్ ఆర్టిస్ట్ భయపడ్డాడని చెప్పారు. ఇక అదే పిస్టల్ తీసుకుని డమ్మీ పిస్టల్ యే కదా అని తాను పీఎల్ నారాయణను బెదిరించానని చెప్పాడు.
Advertisement
Advertisement
అంతే కాకుండా ఆ పిస్టల్ తో పీఎల్ నారాయణను సరదాగా గొంతు దగ్గర కాల్చానని చెప్పారు. దాంతో గట్టిగా శబ్దం వచ్చి రక్తం కూడా కారిందని అన్నారు. అదే సమయంలో రాజశేఖర్ షూటింగ్ కు వచ్చారని ఆయన వెంటనే ఫాస్ట్ ఎయిడ్ చేశారని చెప్పారు. అక్కడ నుండి కారులో ఆస్పత్రికి తరలించామని అతడిని పరిశీలించిన డాక్టర్ లు ప్రమాదం ఏమీ లేదని చెప్పారని అన్నారు.
నకిలీ పిస్టల్స్ కూడా ఎఫెక్ట్ కోసం కాస్త శబ్దం వస్తుందని…అందులో నుండి నకిలీ బుల్లెట్ వస్తుందని చెప్పారు. అయితే అది గొంతుకు దగ్గరగా పెట్టి కాల్చడం వల్ల బుల్లెట్ దిగిందన్నారు. కాస్త లోతుకు బెల్లెట్ వెళితే అతడి ప్రాణాలు పోయేవని చెప్పారు. రాజశేఖర్ డాక్టర్ కావడం వల్ల అతడి అన్నవాహికకు బుల్లెట్ దిగలేదని ముందే చేయిపెట్టి పరిశీలించారని అన్నారు.