Home » కంచెర‌పాలెం హీరో ఎంగేజ్మెంట్…వైర‌ల్ అవ‌తున్న ఫోటోలు…!

కంచెర‌పాలెం హీరో ఎంగేజ్మెంట్…వైర‌ల్ అవ‌తున్న ఫోటోలు…!

by AJAY
Ad

కేరాఫ్ కంచెర పాలెం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న న‌టుడు కార్తీక్ ర‌త్నం. ఈ సినిమాలో కార్తీక్ ర‌త్నం న‌ట‌నకు మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ సినిమా త‌ర‌వాత పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. నార‌ప్ప సినిమాలో వెంక‌టేష్ పెద్ద కుమారుడిగా చేసిన పాత్రకు కార్తీక్ ర‌త్నం కు మంచి మార్కులు ప‌డ్డాయి.

Advertisement

ఆ త‌ర‌వాత అర్ధ శ‌తాబ్దం, చెక్ సినిమాల‌లో కూడా న‌టించి అల‌రించాడు. ఇక రీసెంట్ కార్తీక్ ర‌త్నం ఇటీవ‌ల విడుద‌లైన రౌడీ బాయ్స్ సినిమాలోనూ న‌టించి అల‌రించాడు. కార్తీక్ ర‌త్నం ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే….సీఎ చదువుతున్న స‌మ‌యంలోనే కార్తీక్ ర‌త్నం సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో ఇండ‌స్ట్రీలోకి ఇచ్చాడు. మొద‌ట థియేట‌ర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి ఆ త‌ర‌వాత సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నం చేశాడు.

Advertisement

అలా చేస్తున్న స‌మ‌యంలోనే కేరాఫ్ కంచెర‌పాలెం సినిమా ఛాన్స్ వ‌చ్చింది. ఈ యంగ్ హీరో హైద‌రాబాద్ లోనే పుట్టి ఇక్క‌డే చ‌దువును పూర్తిచేశాడు. ఇదిలా ఉండ‌గా ఈ యంగ్ హీరో తాజాగా ఓ ఇంటివాడ‌య్య‌డు. హైద‌రాబాద్ కు చెందిన యువ‌తితో కార్తీక్ నిశ్చితార్థం జ‌రిగింది. ఓ హోట‌ల్ లో నిశ్చితార్థం జ‌ర‌గ్గా బంధువులు కుటుటంబ స‌భ్యులు హాజ‌రయ్యారు.

Visitors Are Also Reading