Home » పుష్ప పార్ట్ 1 లో ‘తగ్గేదిలే’ లాగా.. పార్ట్ 2 లో ఏది పెట్టబోతున్నారో తెలుసా ?

పుష్ప పార్ట్ 1 లో ‘తగ్గేదిలే’ లాగా.. పార్ట్ 2 లో ఏది పెట్టబోతున్నారో తెలుసా ?

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన పుష్ప సినిమా మాత్రం ప్రత్యేకమైన చిత్రమనే చెప్పాలి. ఈ సినిమా అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల కాగా అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. దానికి కారణం పలువురు క్రికెటర్ లు అల్లు అర్జున్ డైలాగులను సోషల్ మీడియాలో చెప్పడం.. మరియు ఏకంగా మ్యాచ్ మధ్యలో అనుకరించడమే.

Advertisement

ఇక పుష్ప అంతటి విజయం సాధించడానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సుకుమారు డైరెక్షన్ ఈ సినిమాకు ప్లస్ అయితే మరొకటి సినిమాలోని డైలాగులు మేనరిజం ఓ రేంజ్ లో ఉండడం అనే చెప్పాలి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను చిత్తూరు యాసలో తెరకెక్కించారు. దాంతో ఈ సినిమా కోసం అల్లుఅర్జున్ ప్రత్యేకంగా చిత్తూరు యాస కూడా నేర్చుకున్నారు.

Advertisement

అంతేకాకుండా హీరోయిన్ రష్మిక సైతం చిత్తూరు యాసను వంట పట్టించుకుంది. అదేవిధంగా సినిమాలోని నటీనటులు సైతం యాస కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఇక సినిమాలోని డైలాగుల విషయానికి వస్తే అల్లు అర్జున్ తలకింద చేయి పెట్టుకుని చెప్పే తగ్గేదేలే అనే డైలాగ్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇదే డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది.

అయితే ఇప్పుడు పుష్ప పార్ట్ 2 లో ఈ డైలాగ్ ఉండబోదని తెలుస్తోంది. అంతేకాకుండా పుష్ప-2 కోసం సుకుమార్ మరో కొత్త డైలాగును సిద్ధం చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప పార్ట్ 1 లో అల్లు అర్జున్ తగ్గేదేలే అంటే పార్ట్ -2 లో కుమ్మేస్తా అని అనబోతున్నారట. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading