Home » పేరు మార్చుకున్న చిరంజీవి…! కారణం అదేనా…?

పేరు మార్చుకున్న చిరంజీవి…! కారణం అదేనా…?

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరవాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. చిరంజీవి రీసెంట్ గా ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాంతో తన తరవాత సినిమా గాడ్ ఫాదర్ పై మెగాస్టార్ ఫోకస్ పెంచారు. ఈ సినిమా ను మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లుసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Advertisement

ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా నుండి మెగాస్టార్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టర్ లో చిరంజీవి పేరు ఇంగ్లీష్ లో స్పెలింగ్ మారిపోయింది. సాధారణంగా చిరంజీవి అంతే chiranjeevi అని రాయాలి. కానీ chiranjeeevi అని పోస్టర్ లో కనిపిస్తోంది. దాంతో అనేక వార్తలు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ ఎక్కువగా న్యూమరాలజీ ని నమ్ముతారని కలిసి రావడం లేదని మెగాస్టార్ తన పేరును మార్చుకున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇదే విషయం పై ఆయన సన్నిహితులు మరో రకంగా చెబుతున్నారు. కావాలని చిరంజీవి పేరు మార్చుకోలేదు అని వీడియో ఎడిటింగ్ లో తప్పు జరగటం వల్లనే స్పెల్లింగ్ మారిపోయింది అని చెబుతున్నారు. అందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading