Home » టాలీవుడ్ ముద్దుగుమ్మ‌ల రెమ్యున‌రేష‌న్స్ ఎంతో తెలుసా..? ఎవ‌రికి ఎక్కువంటే..!

టాలీవుడ్ ముద్దుగుమ్మ‌ల రెమ్యున‌రేష‌న్స్ ఎంతో తెలుసా..? ఎవ‌రికి ఎక్కువంటే..!

by AJAY
Ad

ఒక‌ప్పుడు హీరోలు మాత్ర‌మే కోట్ల‌ల్లో రెమ్యున‌రేషన్ లు పుచ్చుకునేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్ లు సైతం కోట్ల‌ల్లో రెమ్యున‌రేష‌న్ ల‌ను పుచ్చుకుంటున్నారు.

Advertisement

లేడీ ఓరియంటెడ్ సినిమాలైతే ఇంకా ఎక్కువే పుచ్చుకుంటున్నారు. కాగా సౌత్ లో ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్ ల రెమ్యున‌రేష‌న్ లు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత టాలీవుడ్ తో పాటూ తెలుగు హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2, పుష్ప సినిమాలో ఐట‌మ్ సాంగ్ చేసిన త‌ర‌వాత స‌మంతకు డిమాండ్ పెరిగిపోయింది. ప్ర‌స్తుతం ఈ భామ రూ.3 నుండి రూ.5కోట్ల వ‌ర‌కూ రెమ్యున‌రేష‌న్ అందుకుంటోంది.

Anushka Shetty

Anushka Shetty

ప్ర‌స్తుతం అనుష్క శెట్టి పెద్ద‌గా సినిమాలు చేయ‌డం లేదు. కానీ న‌వీన్ పొలిశెట్టి హీరోగా ఓ సినిమాలో న‌టిస్తోంది. ఇక అనుష్క ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు డిమాండ్ చేస్తున్న‌ట్టు టాక్.

Advertisement

పుష్ప సినిమాతో ర‌ష్మిక‌మంద‌న నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారిపోయింది. ఈ సినిమాతో వ‌చ్చిన క్రేజ్ కార‌ణంగా బాలీవుడ్ లో సైతం సినిమాలు చేస్తోంది. ఇక ప్ర‌స్తుతం ర‌ష్మిక ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల రెమ్యున‌రేష‌న్ ను డిమాండ్ చేస్తోంది.

న‌య‌నతార సీనియ‌ర్ హీరోల‌తో జోడీ క‌డుతున్నా రెమ్యున‌రేషన్ విష‌యంలో రాజీప‌డటం లేదు. ఒక్కో సినిమాకు న‌య‌న‌తార రూ.3 కోట్లు అంత‌కంటే ఎక్కువే తీసుకుంటున్న‌ట్టు టాక్.

అల వైకుంఠ‌పురం సినిమాతో బుట్ట‌బొమ్మ పూజహెగ్డే ఫుల్ బిజీ అయిపోయింది. టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అంద‌రి ప‌క్క‌నే న‌టించే అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటోంది. ఇక ఒక్కో సినిమాకు ఈ బ్యూటీ రూ.5 కోట్ల రెమ్యున‌రేషన్ ను అందుకుంటోంది.

ALSO READ : నరేష్ పవిత్ర లోకేష్ ల పై శ్రీరెడ్డి ఓ రేంజ్ లో ఫైర్… తాట తీస్తా అంటూ….!

Visitors Are Also Reading