Home » మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..!!

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..!!

by Sravanthi
Ad

సాధారణంగా మానవ శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. శరీరంలో ఉండే మలినాలను తొలగించి శుభ్రంగా ఉంచడంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయని మనందరికీ తెలుసు. సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరంలో ఉండే మలినలు ఎప్పటికప్పుడు తొలగిపోవాలి. మలినాలు తొలగిపోవాలి కిడ్నీలు బాగుండాలి అంటే ఇలాంటి ఆహారం తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
1. బెర్రీస్:

బెర్రీస్ అనేది వివిధ రంగుల్లో లభ్యమవుతూ ఉంటాయి. వీటిలో బ్లాక్ బెర్రీ తప్ప మిగతావన్నీ కిడ్నీలకు మేల్ చేస్తాయి. ముఖ్యంగా బ్లూ బెర్రీ, క్రాన్ బెర్రీస్, స్ట్రాబెర్రీ అన్నింటిలోనూ న్యూట్రియన్స్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ క్వాలిటీ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వ్యాధి నిరోధకత పెరిగి కిడ్నీ సమస్యలు దరి చేరవు.
2. వెల్లుల్లి:

Advertisement

Advertisement

సాధారణంగా వెల్లుల్లి అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు, యాంటీ క్లాటింగ్ కణాలు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి.
3. క్యాబేజీ:

క్యాబేజీ అనేది మూత్ర పిండాల పనితీరును మెరుగుపరచడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇది కిడ్నీలకు మంచి ఔషధంగా చెప్పవచ్చు.
4.ఉల్లిపాయ:

ముఖ్యంగా ఉల్లిపాయ అనేది కిడ్నీలో ఉండే రాళ్లను తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి కిడ్నీ ఆ సమస్యలు ఉన్నవారు ఈ ఆహార పదార్థాలను తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

5.మొలకెత్తిన విత్తనాలు :

మొలకెత్తిన విత్తనాలైనా శనగలు, పెసర్లు తినడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలో ఉన్నటువంటి ఫైబర్ శరీరంలోని మలినాలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతాయి.

also read:World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ నుంచి ఇండియా ఔట్.. కారణాలివే..!

Visitors Are Also Reading