Home » తెలంగాణ‌లో మ‌రో రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు జాగ్ర‌త్త ..!

తెలంగాణ‌లో మ‌రో రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు జాగ్ర‌త్త ..!

by Anji
Ad

తెలంగాణ రాష్ట్రంలో గ‌త వారం రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. సూర్యుడి కోసం ప్ర‌జ‌లు ఎదురుచూస్తుండ‌గా వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌ట‌న‌లు మాత్రం షాక్‌కు గురి చేస్తున్నాయి. ఇప్ప‌టికే భారీ వ‌ర్షాల‌తో అల్లాడుతున్న తెలంగాణలో బుధ‌, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ సూచించింది. హైద‌రాబాద్ స‌హా ప‌లు ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు ముసురుప‌ట్టి వ‌ర్షం కురుస్తూనే ఉంది. దీనికి తోడు చ‌ల్ల‌ని గాలులు వీస్తుండ‌డంతో ప్రజ‌లు చ‌లికి వ‌ణికిపోతున్నారు.


ఉత్త‌రాంధ్ర‌, ఒడిశా రాష్ట్రాల‌పై కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం మరింత బ‌ల‌ప‌డింది. దీనికి అనుబంధంగా స‌మ‌ద్ర మ‌ట్టం నుండి 7.6 కిలోమీట‌ర్ల ఎత్తులో ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం నైరుతి దిశ వైపు వంపు తిరిగింది. మ‌రోవైపు తూర్పు, ప‌శ్చిమ భార‌త ప్రాంతాల మ‌ధ్య గాలుల్లో అస్థిర‌తతో మ‌రో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం 3.1 కిలోమీట‌ర్ల ఎత్తున ఉత్త‌ర భార‌త‌వైపున‌కు వ్యాపించి ద‌క్షిణ భార‌త‌దేశం వైపు వంపు తిరిగి ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. తెలంగాణ‌లో రుతుప‌వ‌నాలు చురుకుగా క‌దులుతున్నందున వీటి ప్ర‌భావంతో ప‌లు ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. కొద్ది గంట‌ల్లోనే కారు మేఘాలు ఏర్ప‌డి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు మ‌రో రెండు, మూడు రోజులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

Advertisement

Advertisement


నిన్న ఉద‌యం 8.30 నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు రాష్ట్రంలోని సుమారు 50 ప్రాంతాల్లో స‌గ‌టున 10 సెంటీమీట‌ర్ల‌కు పైగా వ‌ర్షాలు కురిశాయి. కుమురంభీం జిల్లా జైనూర్‌లో అత్య‌ధికంగా 17.9 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదు అయింది. క‌రీంన‌గ‌ర్ జిల్లా ఆమ‌కొండ‌లో 17.8 పెద్ద‌ప‌ల్లి జిల్లా క‌నుకుల‌లో 17.7 ఆదిలాబాద్ జిల్లా హీరాపూర్‌లో 16.8 పిప్ప‌ల్ ధ‌రిలో 15.6 సెం.మీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. భారీ వ‌ర్షాల‌తో న‌ల్ల‌గొండ జిల్లాలో ఉష్ణోగ్ర‌త‌లు ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా త‌గ్గిపోయాయి. సాధార‌ణ క‌నిష్ట ఉష్ణోగ్ర‌త న‌ల్ల‌గొండ‌లో 25.7 డిగ్రీలు న‌మోదు అయితే మంగ‌ళ‌వారం రోజు 20.4 డిగ్రీలు న‌మోదు అయింది. మ‌రొక వైపు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింది. విద్యుత్ డిమాండ్ జులై 12, 2022 రోజు గ‌రిష్టంగా 5755 మెగావాట్ల‌కు త‌గ్గిపోయింది. గ‌త ఏడాది ఇదే రోజు విద్యుత్ డిమాండ్ 6487 ఉండ‌డం గ‌మ‌నార్హం.

Also Read : 

ఫ్లాపుల్లో ఉన్న హీరోలను స్టార్స్ చేసిన హీరోయిన్ శృతిహాసన్.. ఆ 7 సినిమాలు ఇవే..!!

డీజే టిల్లు సినిమా ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప‌క్కా..!

 

Visitors Are Also Reading