ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తీవ్రమైన నిద్రలేమితో బాధపడుతున్నాడని దక్షిణ కొరియా నిగా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అంచనాకొచ్చింది. దీనికి తోడు అతడు విపరీతంగా బరువు పెరిగినట్లు గుర్తించింది. అతడికి ఉన్న ఆల్కహాల్, నికోటిన్ వ్యసనాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నాయి.
Advertisement
ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధికారులు నిద్రలేమి సమస్యకు చికిత్స కోసం లోతైన వైద్య సమాచారం సేకరించే పనిలో పడ్డట్లు ఎన్ ఐ ఎస్ గుర్తించింది. ఈ మేరకు ఎన్ఐసి బ్రీఫింగ్స్ ను దక్షిణ కొరియా పార్లమెంటరీ ఇంటలిజెన్స్ కమిటీ సభ్యుడు యుసాంగ్ మీడియాతో పంచుకున్నారు.
Advertisement
ఇటీవల ఉత్తరకొరియా భారీ ఎత్తున విదేశీ సిగరెట్లు, ఆల్కహాలతో పాటు తీసుకునే చిరుతిళ్లను దిగుమతి చేసుకున్నట్లు వెల్లడించారు. దీనికి కిమ్ ఇటీవల చిత్రాలను కృత్రిమ మేదతో విశ్లేషించగా… అతడు బరువు పెరిగినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం 140 కిలోల వరకు ఉండొచ్చని పేర్కొన్నారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా…?
Sanghavi: ఒకప్పటి హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో తెలుసా ?
భోజనం చేసిన తర్వాత… ఈ తప్పులు చేయకండి!