తెలుగునాట ప్రతి పండగకు ఓ విశిష్టత ఉంటుంది. పండగలకు చేసుకునే కార్యక్రమాలే కాకుండా వండుకుని తినే పిండివంటలతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సంక్రాంతి పండుగ చలి కాలంలో వస్తుంది. ఈ కాలంలో చేసే పిండివంటల్లో నువ్వులను వాడతారు. నువ్వులు వాడటం వల్ల శరీరంలో వేడి పెరిగి చలిని తట్టుకునే శక్తి వస్తుంది. ఇక ఉగాది పండగకు కూడా ఓ ప్రత్యేకత ఉంది.
ఈ పండగకు ఉగాదిపచ్చడిని ప్రత్యేకంగా చేస్తారు. షడ్రుచుల సమ్మేళనంతో ఈ పచ్చడిని తయారు చేస్తారు. ఇక ఈ పచ్చడి తినడం వల్ల వచ్చే ఆరోగ్యప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…ఉగాది పచ్చడిలో వేసే మామిడి కాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల సూర్యుడి నుండి వచ్చే అతి నీలాలోహిత కిరణాల నుండి రక్షిస్తుంది.
మామిడి గుజ్జు తినడం వల్ల చర్మం పై ముడతలు పడకుండా ఉంటుంది. వేపలో ఉండే యాంటి బ్యాక్టీరియల్ గుణాలు కడుపులో ఉండే చెడు బ్యాక్టీరియాను అంతం చేస్తాయి. అంతే కాకుండా కడుపులో ఏమైనా వాపులు ఉంటే తగ్గిస్తాయి. చర్మం పొడిబారటం నుండి కూడా వేప రక్షిస్తుంది. బెల్లంలో గైకోలిక్ యాసిడ్ ఉంటుంది.
ALSO READ : వీలునామా ని రాసేటప్పుడు ఈ తప్పులు చేస్తే అవి చిత్తు కాగితంతో సమానం అని మీకు తెలుసా..?
ఇది చర్మం పై ముడతలు పడి ఏజింగ్ లుక్ రాకుండా కాపాడుతుంది. ఉగాది పచ్చడిలో బెల్లం ముక్కలు తగులుతుంటే ఎంతో రుచిగా ఉంటుంది. చింతపండు గాయాలను త్వరగా మాన్పడానికి ఎంతో ఉపయోగపడుతుంది. చింతపండుతో రుచితో పాటూ ఎంతో ఆరోగ్యం కూడా వస్తుంది. ఉప్పు వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి.