Home » బెల్లం టీ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. తాగకుండా ఉండలేరు..!

బెల్లం టీ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. తాగకుండా ఉండలేరు..!

by Anji
Ad

సాధారణంగా చాలా మంది టీ ని ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. కొంత మంది అయితే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు గంటకు ఒకసారి  టీ తాగుతుంటారు. చాయ్ లేకుంటే వారికి రోజులో ఏ పని కూడా ప్రారంభం కాదు. రోజుకు ఎన్నిసార్లు టీని ఇష్టంగా తాగుతుంటారు.చక్కర చాయ్ తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీంతో మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. చాలా సార్లు టీ తీసుకోవడం వల్ల దానిలో ఉన్న షుగర్ శాతం క్యాలరీలు మన శరీరంలోనికి వెళ్లే విధంగా చేస్తాయి. శరీరంలో క్యాలరీలు ఎక్కువగా ఉండడం వల్ల బరువు పెరుగుతారు. అందుకే టీలో షుగర్ కి బదులుగా బెల్లం వాడడం వల్ల చాాలా ప్రయోజనాలున్నాయి. 

Advertisement

బెల్లం టీ చాలా రుచికరమైనదే కాకుండా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బెల్లం టీ తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంత మంది పలు కారణాల వల్ల రక్తహీనతతో ఇబ్బందిపడుతుంటారు. దీనిని తగ్గించుకోవడం కోసం పాలు బెల్లం టీ ఉత్తమ పరిష్కారం. బెల్లంలోనే ఐరన్ కంటెంట్ కారణంగా బెల్లంటీ తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ఈ టీలో బెల్లంతో పాటు కొద్దిగా అల్లం, మిరియాలు వేసుకొని త్రాగడం వల్ల మన శరీరంలోని రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు ఇతర ఇన్ఫెక్షన్ నుంచి వచ్చే వ్యాధులతో పోరడటానికి నిరోధక శక్తి చాలా బాగా సహాయపడుతుంది. 

Advertisement

Also Read :  ఈ ఆకు రసంతో కిడ్నీలో రాళ్లు కరగడంతో పాటు ఆ సమస్యలు కూడా దూరం..! 

Manam News

బెల్లంలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ కూడా నశింపజేస్తుంది. బరువు తగ్గే క్రమంలో కొంత మంది టీ తాగడం మానేస్తుంటారు. చక్కెరకు బదులు బెల్లం టీ తాగితే శరీరంలోని క్యాలరీలు తగ్గుతాయి. బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది. బెల్లంలోని ఖనిజాలు, విటమిన్లు అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తాయి. బెల్లం టీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో పొట్ట సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు.  

Also Read :  ఈ జ్యూస్ తాగితే పొట్ట, నడుము చుట్టూ కొవ్వు మాయం అవ్వడం పక్కా..!

Visitors Are Also Reading